అన్వేషించండి

When Is Hepatitis An Emergency?: హెపటైటిస్ ఎప్పుడు ప్రాణాంతకమవుతుంది? లీవర్ ఫెయిల్యూర్‌ ప్రమాదాన్ని చెప్పే ఆరు రెడ్‌ఫ్లాగ్స్ ఇవే!

హెపటైటిస్‌ వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు కొన్ని గంటల్లోనే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీంతో మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. అసలు ఇలాంటి పరిస్థితిని ముందే ఎలా గుర్తించాలో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మన శరీరంలో కీలకమైన కాలేయాన్ని హెపటైటిస్ దెబ్బతీస్తుంది.
  • కలుషిత ఆహారం, రక్తం ద్వారా వ్యాప్తి చెంది ప్రాణాంతకం.
  • మెదడు, రక్తం, పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • తక్షణ వైద్యం, కాలేయ మార్పిడితో ప్రాణాలు రక్షించవచ్చు.

When Is Hepatitis An Emergency?: మన శరీరంలో చాలా అవయవాలు ఒకటి కంటే ఎక్కువ విధులు నిర్వహిస్తుంటాయి. అయితే దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ పనులు చేస్తున్న ఆర్గాన్ మాత్రం కాలేయం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి అందులో ఉండే విషయపదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు అన్నింటికీ బాస్‌ లీవరే. అందుకే లీవర్‌ ఫెయిల్యూర్‌ అయితే మల్టిపుల్ ఆర్గాన్స్‌ డ్యామేజ్ అవుతాయి. అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న లీవర్‌ను ప్రమాదంలోకి నెట్టేది హెపటైటిస్‌. ఒకసారి హెపటైటిస్‌ సోకిన తర్వాత సాధారణమైన కామెర్లు అనుకొని చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏదో ఒక నాటు మందు తీసుకొని తగ్గిపోయిందనే భ్రమలో ఉంటారు.

వైద్య నిపుణులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త అవసరం అని చెబుతుంటారు. ఈ హెపటైటిస్ చాలా సైలెంట్‌గా కాలేయాన్ని దెబ్బ తీస్తుందని, గంటల వ్యవధిలోనే పూర్తిగా డ్యామేజ్ చేసి మనిషి ప్రాణాలు తీస్తుందని చెబుతున్నారు. అలాంటి దాన్ని వైద్య పరిభాషలో ఫుల్మినెంట్‌ హెపటైటిస్‌ అంటారు. ఇది వచ్చింది అంటే మనిషి బతికే ఛాన్స్ చాలా తక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రాక ముందే మన బాడి కొన్ని సంకేతాలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి గురించి చూద్దాం. 

హెపటైటిస్ అంటే ఏంటీ? లోపల ఏం జరుగుతుంది?

హైపైటిస్ అంటే వాడుక భాషలో లీవర్‌ వాచిపోవడం అంటారు. ఇందులో చాలా వైరస్‌లు ఉన్నాయి హెపటైటిస్‌ A, B, C, D, E, ఉన్నాయి. ఇందులో మొదటి చివరి రెండు కూడా కలుషిత ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన నీరు తాగినప్పుడు వస్తుంది. మిగతావి రక్తం, శారీరక ద్రవాలు, సురక్షితం కాని శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. 

ఇలాంటి వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి యాక్టివేట్ అవుతుంది. అయితే కాలేయానికి వైరస్ పట్టుకోవడం వల్ల దానిపై కూడా రోగనిరోధక శక్తి దాడి చేస్తుంది. దీంతో కాలేయాన్ని కూడా తినేస్తుంది. దీంతో తాను చేయాల్సిన ప్రాథమిక పనులు పూర్తిగా లీవర్ మానేస్తుంది. 

హెపటైటిస్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

చాలా మందిలో నార్మల్‌గా ఈ వ్యాధి సోకిన కొన్ని రోజుల వరకు ఆకలి వేయదు, అలసటగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కానీ బీ లేదా ఇ వైరస్ సోకినప్పుడు మాత్రం ప్రాణాంతకంగా మారవచ్చు. ఇది ఒకటి, రెండు శాతం కేసుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వీళ్లకు అంతర్గతంగా డ్యామేజ ఎక్కువగా ఉంటుంది. కాలేయం కుళ్లిపోవడం ప్రారంభమవుుంది. ఇది క్రమంగా అక్యూట్ లీవర్‌ ఫెయిల్యూర్ అంటారు. దీంతో రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్ల తయారీ, అమ్మోనియా వంటి వ్యర్థాల ఫిల్టరింగ్ ఆగిపోతుంది. 

ప్రమాదకరంగా మారిందని ఎలా తెలుస్తుంది?

కాలేయం దెబ్బతిన్నప్పుడు అమ్మోనియాను యూరియాగా మార్చలేదు. దీంతో అమ్మోనియా మెదడులోకి చేరుతుంది. దీంతో వ్యక్తిలో విపరీతమైన నిద్ర, మతిమరుపు, గందరగోళం, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

మనకు ఏదైనా దెబ్బ తగిలితే కాసేపు రక్తం వస్తుంది. కానీ తర్వాత రక్తం గడ్డకడుతుంది. ఇలా రక్తంలోని గడ్డకట్టించే క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ అన్నీ లీవర్‌లోనే ఉంటాయి. లీవర్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తం కారడం ఎక్కువ అవుతుంది. 

కాలేయం పని చేయకపోతే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రక్తంలోని ప్లాస్మా ద్రవం పొట్ట భాగంలోకి లీక్ అవుతుంది. దీంతో రోగి పొట్ట ఉబ్బిపోతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. రోగి  ఏం తిన్నా సరే వాంతులు కావడం కూడా ఒక లక్షణం. దీని వల్ల త్వరగా డీహైడ్రేట్ అవుతారు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. 

లీవర్‌ ఉండే భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. రక్తంలో బిలిరుబిన్ స్థాయి 20 రెట్లు పెరగడం వల్ల కళ్లు, చర్మం నిమ్మకాయ రంగులోకి మారుతాయి. 

ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

అక్యూట్‌ లీవర్ ఫెయిల్యూర్ ఉన్న రోగికి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించాలి. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, హెపటాలజిస్ట్ అందుబాటులో ఉన్న, కాలేయ మార్పిడి సదుపాయం ఉన్న ఆసుపత్రిలో చేర్చాలి. చాలా మంది జ్వరం లేదా నొప్పి వస్తే పారాసిటమా్‌ మాత్రలు వేస్తుంటారు. కానీ దెబ్బతిన్న లీవర్‌పై పారాసిటమాల్‌ మరింత టాక్సిక్‌ ఎఫెక్ట్‌ను కలిగిస్తుంది. ఆసుపత్రిలో చేరిన రోగికి ఎల్‌ఎఫ్‌టీ, పీటీ-ఐఎన్‌ఆర్‌, రక్తంలో అమ్మోనియం స్థాయిలను కొలిచే పరీక్షలను చేయించాలి. 

Frequently Asked Questions

హెపటైటిస్ అంటే ఏమిటి?

ఇది వాడుక భాషలో కాలేయం వాపు. హెపటైటిస్ A, B, C, D, E వంటి అనేక రకాల వైరస్‌లు కాలేయానికి సోకడం వల్ల ఇది వస్తుంది.

హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుంది?

హెపటైటిస్ A, E కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తాయి. B, C, D రక్తం, శారీరక ద్రవాలు, సురక్షితం కాని శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతాయి.

హెపటైటిస్ ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది?

హెపటైటిస్ B లేదా E వైరస్ సోకిన 1-2% కేసుల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. ఇది కాలేయ పనితీరును పూర్తిగా దెబ్బతీసి, ఫుల్మినెంట్ హెపటైటిస్‌కు దారితీస్తుంది.

హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే తీవ్ర లక్షణాలు ఏమిటి?

విపరీతమైన నిద్ర, మతిమరుపు, గందరగోళం, కామెర్లు, పొట్ట ఉబ్బరం, అధిక రక్తస్రావం, వాంతులు వంటివి ప్రధాన లక్షణాలు. ఇవి అమ్మోనియా పెరగడం వల్ల వస్తాయి.

హెపటైటిస్ వల్ల వచ్చే అక్యూట్ లీవర్ ఫెయిల్యూర్‌కు చికిత్స ఎలా చేయాలి?

రోగికి వెంటనే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్ అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించాలి. కాలేయ మార్పిడి సదుపాయం ఉన్న చోట చేర్చడం అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget