Heartburn Remedies: ఛాతీలో మంట తరచూ వేధిస్తుందా? ఓసారి ఇలా చేసి చూడండి

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. దాని వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది.

FOLLOW US: 

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. దాని వల్ల గుండెల్లో మంటగా ఉండటం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సాధారణంగా సాయంత్రం తిన్నా తర్వాత లేదా పడుకున్నపుడు ఛాతిలో మంటగా అనిపిస్తుంది. చాలా మంది చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ దాని నుంచి ఉపశమనం పొందుతున్నారు. అసలు ఆ సమస్యే రాకుండా ఉండాలంటే మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు దాన్ని మనం అధిగమించవచ్చు.  

ఛాతిలో మంట అసలెందుకు వస్తుంది?

సాయంత్రం వేళ ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది. ఆకలి అవుతుంది కదా అని చాలామంది గబగబా  లాగించేస్తారు. కానీ అది మనకే నష్టం కలిగిస్తుంది. దీని వల్ల మన కడుపులో ప్రమాదకరమైన యాసిడ్స్ ఉత్పన్నమవుతాయి. తిన్నా వెంటనే పడుకోకూడదు. ఒబేసిటీ సమస్య ఉన్న వాళ్ళని ఈ ఛాతిలో మంట ఎక్కువగా బాధిస్తుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైన, కెఫీన్ ఎక్కువగా తీసుకున్న, మద్యం సేవించే అలవాటు ఉన్నా, చాక్లెట్స్, టమాటా తో చేసిన స్పైసీ ఫుడ్ తరచూ తిన్నా కడుపులో గ్యాస్ ఏర్పడి దాని వల్ల ఛాతిలో మంట వస్తుంది.

ఛాతీ మంటని గుర్తించడమేలా?

కడుపులో అసౌకర్యంగా ఉండటం గొంతు, పొట్ట వెనక భాగంలో వేడిగా సెగలు రావడం వంటివి ఛాతిలో మంటను  గుర్తించే సంకేతాలు. ఛాతిలో మంట కొన్ని గంటల పాటు మనల్ని ఇబ్బంది పెడుతుంది. వంగేటప్పుడు లేదా పడుకునేటప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. గొంతులో విపరీతమైన మంట, మింగడంలో ఇబ్బంది కూడా దీనికి సంకేతమే.  

ఉపశమనం పొందడమెలా?

అరటి పండు తినడం: కడుపులోని ఇబ్బంది నుంచి బయట పడేందుకు అరటి పండు చక్కటి పరిష్కారం. ఛాతిలో మంటతో బాధ పడేవాళ్ళు పండిన అరటి పండుని తినడం ఉత్తమం. ఇందులో ఉండే పొటాషియం పొట్టలో అసౌకర్యాన్ని కలిగించే యాసిడ్స్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

డైట్ చూయింగ్ గమ్: షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ లాలాజల ఉత్పతిని పెంచుతుంది. దాని వల్ల మన పొట్టలో ఇబ్బంది పెట్టె యాసిడ్స్ ను తగ్గించడంతో పాటు గుండెల్లో మంటని కొంత వరకు అదుపులో ఉంటుంది.

ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి: మనల్ని ఇబ్బంది పెట్టె ఆహారాన్ని తినకుండా ఉండటమే మంచిది. దేని వల్ల యితే మనకి ఇబ్బంది అనిపిస్తుందో వాటికి దూరంగా ఉంటూ డైట్ చార్ట్ రూపొందించుకుని దాన్ని అనుసరించాలి.

కొద్ది కొద్దిగా తినడం: ఆకలి అవుతుంది కదా అని అధిక మొత్తంలో తింటే దాని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే కొంచెం కొంచెం తినాలి. తినేటప్పుడు కూడా గబగబా తినకుండా నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి.

బిగుతు  దుస్తులు ధరించకూడదు: బిర్రుగా బెల్ట్ పెట్టుకోవడం, బిగుతు దుస్తులు ధరించడం చెయ్యకూడదు. బిగుతు  బట్టలు వేసుకోవడం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడుతుంది.

త్వరగా తినాలి: సమయానికి తిండి తినాలి. మనం పడుకునే సమయానికి సుమారు 3 గంట ముందు తినేసి ఉండాలి. తిన్నా వెంటనే పడుకోవడం వల్ల మన పొట్టలో విడుదలయ్యే యాసిడ్స్ కారణంగా ఛాతిలో మంట వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయి.

పడుకునే విధానం: సరైన సమయానికి  పడుకోవడమే కాదు పడుకునే విధానం కూడా ముఖ్యమే. ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది. అలా చెయ్యడం వల్ల మన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. మీ ఛాతీ, తల మీ పాదాల కంటే ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి.

బరువు తగ్గాలి: మీరు కనుక అధిక బరువు ఉంటే దాని ప్రభావం మీ పొట్ట మీద పడుతుంది. అది మీ గుండెకి చాలా ప్రమాదం. వేలైనంత వరకు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.     

స్మోకింగ్ చెయ్యరాదు: స్మోకింగ్ చెయ్యడం మానేయాలి. పొగతాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. దాని వల్ల కడుపులో యాసిడ్స్ ఫామ్ అవుతాయి.

ఛాతిలో మంట మీకు తరచూ వస్తూ ఇబ్బంది పెడుతుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ప్రమాదంగా మరే అవకాశం ఉంది. వైద్యులు సూచించకుండా తరచూ ఏవో ఒక ట్యాబ్లెట్స్ మింగిన కూడా ఛాతిలో మంట వస్తుంది.  

Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

Published at : 06 Jul 2022 02:55 PM (IST) Tags: chest pain Heart burn Gastric Problem Heartburn Symptoms ఛాతీలో మంట

సంబంధిత కథనాలు

Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 40 మంది మృతి

Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 40 మంది మృతి

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Heart Health: చామదుంపలో ఉండే ఈ  గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Chewing Gum Benefits: చూయింగ్ గమ్‌ నమిలితే బరువు తగ్గుతారా? అపోహలు - వాస్తవాలు ఇవే!

Chewing Gum Benefits: చూయింగ్ గమ్‌ నమిలితే బరువు తగ్గుతారా? అపోహలు - వాస్తవాలు ఇవే!

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?