అన్వేషించండి

Sunflower Seeds: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? సన్ ఫ్లవర్ గింజలు తినండి

గింజల్లో ఆరోగ్యం అందించే మోనోసాచురేటెడ్ ఫ్యాట్, పాలీ సాచూరేటెడ్ ఫ్యాట్ తోపాటు విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్లు ఉంటాయి. అటువంటి గింజల్లో అందమైన సన్ ఫ్లవర్ గింజలు కూడా ఒక రకమైనవి.

గింజల్లో చాలా మంచి ఫైబర్ ఉంటుంది. వీటిలో ఆరోగ్యం అందించే మోనోసాచురేటెడ్ ఫ్యాట్, పాలీ సాచూరేటెడ్ ఫ్యాట్ తోపాటు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని భోజనంలో భాగం చేసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి, కొలెస్ట్రాల్, బీపి వంటి అనేక రోగాలను అదుపులో ఉంచవచ్చు.  అటువంటి అద్భుతమైన గింజల్లో అందమైన సన్ ఫ్లవర్ నుంచి వచ్చే గింజలు కూడా ఒక రకమైనవి.

సన్ ప్లవర్ గింజల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు వీటిలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ ఈ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాదు మినరల్స్, జింక్, మెగ్నీషియం, కాపర్, క్రోమియం. కెరోటోనిన్, మోనో సాచూరేటెడ్, పాలీ సాచూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ తో ఇవి పోషకాల భండాగారం వంటివి. ఇందులో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మంచివి.

ఆరోగ్యవంతమైన స్నాక్

ప్రోటీన్లు, ఫ్యాట్, ఫైబర్ కలిగిన సన్ ఫ్లవర్ గింజలను మంచి స్నాక్ ఐటమ్ గా చెప్పుకోవచ్చు. కొద్ది మొత్తంలో తీసుకున్నా సరే కడుపునిండుగా ఉండి మంచి శక్తిని అందిస్తాయి. ఒక ఔన్సు గింజల్లో దాదాపు గా 5.4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఎక్కువ మైక్రోన్యూట్రియెంట్స్ కలిగిన శాకాహారం ఇది. చిన్న ప్యాక్ సన్ ఫ్లవర్ సీడ్స్ వెంట ఉంచుకుంటే ఎక్కడ స్నాక్ తినాలనిపించినా కాస్త నోట్లో వేసుకుంటే సరిపోతుంది.

డయాబెటిస్ కి మంచిది

డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు మధుమేహులకు చాలా అవసరం. సన్ ఫ్లవర్ గింజలలో ఈ పోషకాలు సరిపడినంతా ఉంటాయి. ఏది ఏమైనా మధుమేహం ఉన్నా లేకున్నా ఇవి తీసుకోవడం ఆరోగ్యదాయకం. వీటిని తీసుకోవడం కూడా చాలా సులభం. ఒక గుప్పెడు గింజలు గ్రీన్ సలాడ్ మీద చల్లుకొని తినెయ్యొచ్చు. లేదా ఆపిల్ మక్కలు, బట్టర్ కలిపి తీసుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి

ఫైబర్, విటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్, మినరల్స్ ఉండడం వల్ల సన్ ఫ్లవర్ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. నిజానికి ఏ గింజలేవైనా గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి సన్ ఫ్లవర్ గింజలు దోహదం చేస్తాయి. 2012లో జరిపిన ఒక అధ్యయనంలో 20 మంది డయాబెటిక్ మహిళలకు రోజుకు 30 గ్రాముల చొప్పున మూడు వారాల పాటు సన్ ఫ్లవర్ గింజలను ఆహారంలో ఇచ్చారు. వారిలో బీపీ, ఎడీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ లో గణనీయమైన మార్పు కనిపించిందట.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం

సన్ ఫ్లవర్ గింజల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్, విటమిన్ ఈ వంటి యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ ను అడ్డుకుంటాయి. ఈ సెల్ డ్యామేజి వల్లే జబ్బులు వస్తాయి. అంతేకాదు యాంటిఆక్సిడెంట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్, పక్షవాతం వంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే సన్ ఫ్లవర్ గింజలు ఆయుష్సు పెంచే అమృతం వంటివి. 

Also Read: బాదం పప్పులు పేగుల ఆరోగ్యానికి మంచివేనా? అధ్యయనంలో ఏం తేలింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget