అన్వేషించండి

New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు

Corona BA 3 2: కరోనా వైరస్ మళ్లీ కొత్త శక్తితో విస్తరిస్తోంది. BA.3.2 వేరియంట్ మనుషుల్లో ఉన్న రోగనిరోధక శక్తిని తగ్గించే అవకాశం ఉంది. అందుకే మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి.

Corona BA 3 2 Variant:  కరోనా వైరస్ మళ్లీ కొత్త శక్తితో విస్తరిస్తోందన్న సమాచారం  ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.  తాజాగా వెలుగులోకి వచ్చిన BA.3.2 వేరియంట్, ప్రస్తుతం మనుషుల్లో ఉన్న రోగనిరోధక శక్తిని (Immunity) తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ కొత్త సబ్-వేరియంట్, గతంలో వచ్చిన వేరియంట్ల కంటే భిన్నమైన మ్యుటేషన్లను కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో  ఈ వైరస్ జాడలు కనిపించడంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.

అధిక మ్యుటేషన్లే ప్రధాన బలం 

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, BA.3.2 వేరియంట్ దాని స్పైక్ ప్రోటీన్‌లో దాదాపు  70 నుండి 75 వరకు మార్పులను  కలిగి ఉంది. మనం ప్రస్తుతం వాడుతున్న 2025-26 కోవిడ్ వ్యాక్సిన్లు ప్రధానంగా JN.1 వంటి పాత వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు.  అయితే, ఈ కొత్త వేరియంట్ జన్యుపరంగా వాటికి భిన్నంగా ఉండటం వల్ల, వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీలను ఇది సులభంగా తప్పించుకోగలదని లాబొరేటరీ పరీక్షల్లో తేలింది. దీనివల్ల గతంలో కోవిడ్ వచ్చిన వారికి లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా మళ్లీ సంక్రమించే ప్రమాదం ఉంది.

వ్యాప్తి, తీవ్రత 

ఈ వేరియంట్ ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ సహా 23 దేశాలలో గుర్తించబడింది. డెన్మార్క్ వంటి కొన్ని ఐరోపా దేశాల్లో దీని ప్రాబల్యం 30 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగినప్పటికీ, మరణాల రేటులో మార్పు లేదని, ప్రాథమికంగా ఇది సాధారణ ఒమిక్రాన్ లక్షణాలనే కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

 ముందస్తు జాగ్రత్తలు అవసరం 

BA.3.2 వేరియంట్‌ను WHO ప్రస్తుతం వేరియంట్ అండర్ మానిటరింగ్ జాబితాలో చేర్చింది. అంటే ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, తక్షణ ప్రమాదం లేదని అర్థం. అయితే, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు,  వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ మరింత బలోపేతం కాకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను అప్‌డేట్ చేయాలని , మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి కనీస నిబంధనలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.                                                 

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget