Eat Tomatoes Everyday : రోజూ టమోటాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తినకూడదు?
Eat Tomatoes Everyday : చాలామంది తమ రోజువారి ఆహారంలో టమాటాను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతిరోజు టమాటా తినడం వల్ల మన శరీరానికి మంచిదా కాదా ఇప్పుడు తెలుసుకుందాం.
Eat Tomatoes Everyday: ప్రపంచవ్యాప్తంగా టమోటాకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జ్యూసీ కూరగాయలో పోషక పదార్థాలు కూడా మెండుగా ఉంటాయి. ముఖ్యంగా టమాటోలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. టమోటాలు లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
టమోటాలలో ఉండే రెండు ముఖ్యమైన కెరోటినాయిడ్లను లైకోపీన్, బీటా-కెరోటిన్ అని పిలుస్తారు. ఈ రెండూ యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాదు టమోటాలు ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ సి, ఖనిజ లవణాలు లభిస్తాయి. అయితే, టమోటాలు అతిగా తిన్నా నష్టాలు తప్పవట.
టమోటాలు తినడం వల్ల కలిగే నష్టాలు?
- టమోటాల్లోని యాసిడ్ కంటెంట్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి పరిస్థితుల లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
- అదనంగా, ఇది లైకోపెనోడెర్మియా, మైగ్రేన్లు, గ్లైకోఅల్కలాయిడ్స్‌తో సంబంధం ఉన్న శరీర నొప్పులు, అనాఫిలాక్టిక్ ప్రతిచర్యలు, మూత్ర సమస్యలకు దారితీయవచ్చు.
టమోటాలు మంచివి కాదా?
టమోటాలో ఉండే ఆక్సలేట్‌ల వల్ల రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి, కిడ్నీలో రాళ్లు వంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు టమోటాను అతిగా తీసుకోకపోవడమే మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా సమతుల ఆహారంలో అన్ని ఆహార పదార్థాలను మనం సమపాళ్లల్లో తీసుకోవాల్సి ఉంటుంది ఒకే రకం కూరను ప్రతి రోజు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అలాంటి సందర్భంలో చాలామంది డైటీషియన్లు సూచించిన మేరకు మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే కూరగాయను రోజుల తరబడి వారాల తరబడి తినకుండా. ప్రతిరోజు మార్చుకోవడం ద్వారా అన్ని కూరగాయల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో మన శరీరానికి హాని కలిగించే కొన్ని కూరగాయలను దీర్ఘకాలం తినడం అనేది ప్రమాదకరం. ప్రతిరోజు కూరగాయలను మార్చడం ద్వారా మనకు నష్టం కన్నా లాభమే ఎక్కువ.
ఇక టమోటా విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు టమోటా మాత్రమే తినటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. మీరు తీసుకునే రెగ్యులర్ డైట్ లో టమోటాను వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు ఉదాహరణకు కొంతమంది టమాటో కెచప్ రూపంలోనూ, టమోటా కూర రూపంలోనూ, టమోటా గుజ్జు రూపంలోనూ వాడటం మనం చూస్తూనే ఉంటాము. అయితే ప్రతిరోజు మీ ఆహారంలో కేవలం టమోటా మాత్రమే కాకుండా. మీ డైట్ చార్ట్ ను మార్చుకుంటూ ఆహారం తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు లభించే వీలుందని సూచిస్తున్నారు.
Also Read : సండే స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ పనీర్ క్యాప్సికమ్ మసాలా.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply