అన్వేషించండి

Hungry: పదే పదే ఆకలేస్తుందా? ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు!

అతిగా ఆకలి వేస్తుంటే అది శరీరంలో అనారోగ్యం దరి చేరే ముందు కనిపించే లక్షణం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హారం తిన్న కాసేపటికే కొంతమందికి ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల తలనొప్పి, చిరాకుగా అనిపిస్తుంది. కడుపులో ఆకలి ఘోషిస్తుంటే ఏ పని మీద కూడా ఏకాగ్రత చెయ్యలేరు. ప్రోటీన్స్, కొవ్వు లేదా ఫైబర్ లేని ఆహారం, అధిక ఒత్తిడి లేదా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కూడా ఆకలిగా అనిపిస్తుంది. కానీ తిన్న కొద్ది గంటల్లోనే మళ్ళీ ఆకలిగా అనిపిస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం. నిరంతరం ఆకలితో ఉండటం ప్రాణాంతక వ్యాధికి సంకేతం. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణం కంటే ఎక్కువగా ఆకలితో బాధపడే వాళ్ళు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నట్టే. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల తరచూ ఆకలిగా అనిపిస్తుంది. అధిక దాహం, బరువు తగ్గడం, అలసట వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యని పాలీఫాగియా అని కూడా పిలుస్తారు. ఇది పాలీడిప్సియా పాటు మధుమేహం వచ్చే ముందు కనిపించే ప్రధాన సంకేతాల్లో ఒకటి. దాహం, అతిగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఆకలి, మధుమేహం

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్టు. రక్తం నుంచి గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించదు. ఇన్సులిన్ నిరోధకత లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చలేకపోతుంది. దీని వల్ల ఆకలి పెరుగుతుంది. అనియంత్రిత మధుమేహం ఉన్నవారిలో ఆకలి ఎక్కువగా ఉండటం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి రక్తంలో గ్లూకోజ్ అసాధారణంగా తగ్గడం వల్ల కూడా సంభవించవచ్చు. ఎందుకంటే శరీరం కాలేయం నుంచి నిల్వ చేసిన గ్లూకోజ్ ని విడుదల చేయడం ద్వారా స్థాయిల్ని సాధారణ స్థితికి పెంచుతుంది. దీని వల్ల కూడా ఆకలిగా అనిపిస్తుంది.

ఆకలి బాధ ఎలా ఎదుర్కోవాలి?

నిరంతరం ఆకలిగా అనిపించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నపుడు తినాలనే కోరికని నిరోధించడం చాలా కష్టం. అందుకే ఈ మార్గాల ద్వారా ఆకలి బాధ ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నెమ్మదిగా తినాలి

వివిధ అధ్యయనాల ప్రకారం నెమ్మదిగా తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యని కలిగి ఉంటారు. అందుకే ఆహారాన్ని సరిగ్గా నమలడం ద్వారా నెమ్మదిగా తినడం వల్ల ఆకలిని అడ్డుకోవచ్చు.

టీవీ, ఫోన్ పక్కన పెట్టేయాలి

తినేటప్పుడు టీవీ, మొబైల్ వంటివి చూడటం నివారించాలి. ఇలా చేస్తే మీరు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు. అందుకే వాటిని పక్కన పెట్టి దృష్టి తినడం మీద ఉంచడం వల్ల తక్కువ తినగలుగుతారు. పొట్ట నిండిన వెంటనే మెదడు మనల్ని అలర్ట్ చేస్తుంది.

తినడానికి ముందు నీరు తాగాలి

భోజనాన్ని ప్రారంభించే ముందు ఒక గ్లాసు నీళ్ళని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల ఆకలి కోరిక కొద్దిగా తగ్గుతుంది. ఆహారాన్ని రుచిగా మార్చుకునేందుకు అందులో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచుతాయి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

ప్రోటీన్ రిచ్, అధిక ఫైబర్ ఆహారాన్ని తినాలి. అది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎప్పుడు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ వ్యాయామం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించవచ్చు. బరువు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఉదయాన్నే కాఫీ, టీ కాకుండా ఇవి కలిపిన నీళ్లు తాగండి - అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget