By: ABP Desam | Updated at : 20 Aug 2021 06:45 PM (IST)
డెల్టా వేరియంట్ విజృంభణ
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అని ఇన్సాకాగ్ (ఐఎన్ఎస్ఏసీఓజీ) నివేదిక తెలిపింది. ఈ అధ్యయనంలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.
డెల్టా వేరియంట్ విజృంభించడమే కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. వేరియంట్లపై వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం కూడా ఓ కారణమని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కావాలని మరణాల రేటు తగ్గాలంటే ఇదే ప్రధాన మార్గమని వెల్లడించింది.
భారత్, చైనా, కొరియా సహా ఇతర దేశాల్లో డెల్టా వేరియంట్ ఆందోళన నెలకొంది. కేసుల్లో విజృంభణకు ప్రధాన కారణం డెల్టా ప్లస్ కే417ఎన్ అని కొరియా నిర్ధారించింది.
సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా ధాటికి దేశంలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.
ఇప్పటివరకు 61 డెల్టా ప్లస్ వేరియంట్లు దేశంలో గుర్తించారు. మే లో పీక్ స్టేజ్ లో ఉన్న కరోనా వైరస్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి
కేరళ ఆందోళన..
గత రెండు నెలలుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదయ్యే కేసులలో సగానికి పైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 20 వేలకు పైగా కేరళ రాష్ట్రం నుంచే నిర్ధారణ అయ్యాయి. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో తీసుకోని వారు 3.86 కోట్ల మంది వరకు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. తప్పనిసరిగా తమ రెండో టీకాను నిర్ణీత సమయానికి తీసుకుంటే కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Kerala reports 20,224 new #COVID19 cases, 17,142 recoveries and 99 deaths in the last 24 hours.
— ANI (@ANI) August 20, 2021
Active cases: 1,82,285
Death toll: 19,345
1,19,385 samples tested for COVID in the last 24 hours. Test positivity rate is 16.94%
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!