Corbevax Vaccine DCGI Approval: 12- 18 ఏళ్ల పిల్లల కోసం మరో కరోనా టీకా- కార్బెవాక్స్‌కు డీసీజీఐ అనుమతి
పిల్లల కోసం మరో కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. కార్బెవాక్స్ వినియోగానికి డీసీజీఐ ఆమోదం లభించింది.
![Corbevax Vaccine DCGI Approval: 12- 18 ఏళ్ల పిల్లల కోసం మరో కరోనా టీకా- కార్బెవాక్స్‌కు డీసీజీఐ అనుమతి DCGI grants final approval to Biological E's COVID19 vaccine Corbevax, for children between 12-18 years of age Corbevax Vaccine DCGI Approval: 12- 18 ఏళ్ల పిల్లల కోసం మరో కరోనా టీకా- కార్బెవాక్స్‌కు డీసీజీఐ అనుమతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/17fb6e2bbb637b229600be311c96c2ad_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
12-18 ఏళ్ల పిల్లలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు ఇచ్చింది. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది.
Drugs Controller General of India (DCGI) grants final approval to Biological E's #COVID19 vaccine Corbevax, for children between 12-18 years of age. pic.twitter.com/ad2xftvmzB
— ANI (@ANI) February 21, 2022
12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్‌కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బెవాక్స్ రికార్డులకెక్కింది. బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌బీడీ ప్రొటీన్ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్ అయిన కార్బెవాక్స్ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే ఈ టీకాకు అనుమతులు రాకముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం బయోలాజికల్-ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 1500కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందంలో భాగంగానే డోసుల కొనుగోలుకు ఇటీవల ఆర్దర్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: UP Election: యూపీలో నో బాహుబలి, ఓన్లీ బజరంగ్‌బలి: అమిత్ షా
Also Read: UP Election 2022: 'ఆఫ్ట్రాల్ కాదు సర్- 'సైకిల్'ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే'
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)