X

PM Modi Review: అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌... కరోనా నియంత్రణపై చర్చ

రోజుకు సుమారు రెండు లక్షల కరనా కేసులు నమోదవుతున్న టైంలో కట్టడి చర్యలపై ప్రధాని దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమవుతున్నారు.

FOLLOW US: 

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో పెరుగుతోంది. నిన్న సుమారు రెండు లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడనున్నారు. 

సాయంత్రం నాలుగున్నరకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ జరగనున్నట్టు తెలుస్తోంది. 

ఈ మీటింగ్‌లో ఆయా రాష్ట్రాల్లో కరోనా ఉన్న పరిస్థితి. కట్టడికి తీసుకుంటున్న చర్యలు తెలుసుకోనున్నారు. కేంద్రం తీసుకోబోయే చర్యలను వాళ్లతో చర్చిస్తారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టకేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అడిగి తెలుసుకోనున్నారు. 

ఇరవై నాలుగు గంటల్లో లక్షా తొంభై నాలుగు వేల ఏడువందల ఇరవై కేసులు ఎప్పుడు నమోదయ్యాయో అప్పుడే అన్ని రాష్ట్రాలతో మాట్లాడాలని పీఎంవో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే టైంలో డెత్‌ రేట్‌ కూడా పెరగడంతో ఆందోళన పెరిగింది. 
మూడో వేవ్‌ ముంచుకొచ్చిన టైంలో వివిధ రాష్ట్రాల సీఎంలతో తొలిసారిగా ప్రధాని మాట్లాడనున్నారు. ఒమిక్రాన్ కమ్మేస్తున్న వేళ  పరిస్థితి చేయిదాటిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 

మొదటి, రెండో వేవ్‌లో కూడా చాలా సార్లు ఇలాంటి మీటింగ్స్ పెట్టారు ప్రధాని మోదీ. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్ పంపిణీకి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు. 

ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టడి చర్యలు తీసుకున్నాయి. రాత్రి కర్ఫ్యూ పెట్టాయి. ఇతర ఆంక్షలు కూడా విధించాయి. అయినా వైరస్ ఉదృతి ఇంకా తగ్గలేదు. 

అందుకే ఆదివారం కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించి వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలపై చర్చించారు. రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని అప్పుడే నిర్ణయించారు. వర్చ్యువల్‌గా సీఎంలతో మాట్లాడి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని... ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు, పాటిస్తున్న ఉత్తమ పద్ధతులు, ప్రజారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై మాట్లాడనున్నారు. 

జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీనేజర్స్‌కు ఇస్తున్న వ్యాక్సిన్‌ను మరింత వేగవంతం చేసేలా సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా సహా ఇతర ఆరోగ్య శాఖాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. 

Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Narendra Modi Coronavirus Update PM CMs Covid Meeting Covid-19 Tally India PM Modi Covid Review Meet

సంబంధిత కథనాలు

Minister Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి కరోనా పాజిటివ్... హోంఐసోలేషల్ లో ఉన్నట్లు మంత్రి ట్వీట్

Minister Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి కరోనా పాజిటివ్... హోంఐసోలేషల్ లో ఉన్నట్లు మంత్రి ట్వీట్

Schools Covid: పాఠాశాలలపై కరోనా పంజా... గురుకుల పాఠశాలలో 20 మందికి కోవిడ్... గుంటూరులో ఇద్దరు టీచర్లకు పాజిటివ్..!

Schools Covid: పాఠాశాలలపై కరోనా పంజా... గురుకుల పాఠశాలలో 20 మందికి కోవిడ్... గుంటూరులో ఇద్దరు టీచర్లకు పాజిటివ్..!

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

Covid Update: దేశంలో మళ్లీ మూడు లక్షలు దాటిన కేసులు.. అదే స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల

Covid Update: దేశంలో మళ్లీ మూడు లక్షలు దాటిన కేసులు.. అదే స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల

Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 4,416 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 4,416 కరోనా కేసులు, ఇద్దరు మృతి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?