(Source: ECI/ABP News/ABP Majha)
AP TS Corona Updates: ఏపీలో పెరిగిన రికవరీలు.... కొత్తగా 215 కరోనా కేసులు, ఒకరు మృతి... తెలంగాణలో 164 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 215 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 3,568 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో 164 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,831 మందికి నిర్థారణ పరీక్షలు చేయగా 215 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి శుక్రవారం 406 మంది కోలుకున్నారని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,568 యాక్టివ్ కేసులు ఉన్నాయని కరోనా బులెటిన్‌లో తెలిపింది. కరోనాతో కృష్ణాలో ఒకరు మృతి చెందారు.
#COVIDUpdates: 06/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,65,026 పాజిటివ్ కేసు లకు గాను
*20,47,066 మంది డిశ్చార్జ్ కాగా
*14,392 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,568#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/brWG8GH44I
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,921కి చేరింది. వీరిలో 20,49,961 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 406 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,392కు చేరింది.
తెలంగాణలో 164 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 164 కేసులు నమోదయ్యాయి. 36,999 శాంపిల్స్‌ని పరీక్షించగా 164 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలింది. అలాగే 186 మంది కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.77 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించారు. 6.72 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 6.64 లక్షల మంది కోలుకొని డిశ్చార్జి్ అయ్యారు. 3964 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇంకా 3815 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Also Read: నిధివన్’ మిస్టరీ.. ఈ ఆలయంలో రాత్రి మంచాన్ని అలంకరిస్తారు.. ఉదయానికి అంతా చెల్లాచెదురు..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారిని దాదాపు కట్టడి చేయగా, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,929 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 392 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. జనవరిలో వ్యాక్సినేషన్ పంపిణీ మొదలైనప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,07,92,19,546 (107 కోట్ల 92 లక్షల 19 వేల 546) డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది.
Also Read: పొడవైన తోకతో పుట్టిన శిశువు.. చివరిలో బంతిలాంటి భాగం
భారత్‌లో ప్రస్తుతం 1,46,950 (ఒక లక్షా 46 వేల 950) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,10,783 (8 లక్షల 10 వేల 783) శాంపిల్స్ పరీక్షించగా.. ఓవరాల్ గా 61,39,65,751 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ టెస్టులు చేసినట్లు తాజా హెల్త్ బులెటిన్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు.
Also Read: దేశంలో కొత్తగా 10 వేల పైగా కరోనా కేసులు.. 392 కొవిడ్ మరణాలు