అన్వేషించండి

Insomnia Treatment: సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండానే నిద్రలేమి సమస్యకు పరిష్కారం! CBT-Iథెరపీ గురించి పూర్తి వివరాలు ఇవే!

Insomnia Treatment: నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారా?మందుల అవసరం లేకుండా, ఆలోచనలు, ప్రవర్తనలో మార్పుల ద్వారా మంచి నిద్రను ప్రసాదించే CBT-I థెరపీ. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దీర్ఘకాల నిద్రలేమికి సీబీటీ-ఐ థెరపీ అత్యంత ప్రభావవంతమైన చికిత్స.
  • ఇది నిద్ర భంగపరిచే ఆలోచనలు, అలవాట్లు మార్చి 70-80% ఫలితాలిస్తుంది.
  • పడకను నిద్రకే పరిమితం చేస్తూ, మందుల దుష్ప్రభావాలు లేని చికిత్స.
  • దీర్ఘకాలిక నిద్రలేమికి మందుల కంటే CBT-I థెరపీ అత్యంత ప్రభావవంతమైన మొదటి వరుస చికిత్స
  • నిద్రకు ఆటంకం కలిగించే ప్రతికూల ఆలోచనలు, అలవాట్ల క్రమబద్ధీకరిస్తే మంచి ఫలితాలు 
  • సుమారు 70-80  మందిలో పాజిటివ్ రిజల్ట్స్‌

చాలా మంది నిద్ర పట్టకపోతే వెంటనే నిద్ర మాత్రలవైపు మొగ్గు చూపుతారు. కానీ మాత్రలు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. నిద్రలేమికి మూల కారణాలు తెలుసుకొని శాశ్వత పరిష్కారం చూపే మార్గామే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఫర్ ఇన్‌సోమ్నియా. ఇది ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని శాస్త్రీయ పద్ధతి. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

CBT-I అంటే ఏంటీ?

CBT-I అనేది నిద్రలేమిని తగ్గించడానికి రూపొందించిన ఒక నిర్మాణాత్మక చికిత్స. ఇది మన ఆలోచనల్లో, ప్రవర్తన, నిద్రకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తుంది. ఈ థెరపీలో నిపుణులు మన మెదడులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, నిద్రకు సహకరించే సానుకూల ధోరణిని అలవరుస్తుంది. సాధారణంగా ఈ చికిత్స ఆరు నుంచి 8 సెషన్ల వరకు ఉంటుంది. అయితే వ్యక్తి అవసరాలను బట్టి మారవచ్చు. 

ఇది ఎలా పని చేస్తుంది?

CBT-Iప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ని చేస్తుంది. కాగ్నిటివ్, బిహేవియర్, ఎడ్యుకేషనల్. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్‌ ద్వారా నిద్ర గురించి మనకున్న తప్పుడు ఆలోచనలు, ఆందోళనలను తొలగిస్తారు నిద్రరాకపోతే పడకపై దొర్లడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి, పడక గదిని కేవలం నిద్రకు మాత్రమే పరిమితం చేసేలా మనసును సిద్ధం చేస్తారు. 

ముఖ్యమైన పద్దతులు 

పడక గదిని కేవలం నిద్ర, శృంగారం కోసమే మాత్రమే ఉపయోగించాలి. అక్కడ టీవీ చూడటం, ఫోన్ వాడటం వంటి చేయకూడదు. ఒక వేళ బెడ్‌పైకి వెళ్లిన పది నిమిషాల్లో నిద్ర పట్టకోతే, వెంటనే బెడ్ దిగి వేరే గదిలోకి వెళ్లి ఏదైనా ప్రశాంతమైన పని చేయాలి. 

నిద్రపట్టకుండా బెడ్‌పై గడిపే సమయాన్ని తగ్గించం ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. దీని వల్ల బెడ్‌పై ఉన్నప్పుడు నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం, కండరాల స్ట్రెచ్ చేయడం వంటి పద్ధతులు నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. 

CBT-I ఎందుకు అవసరం?

అమెరికా కాలేజీ ఆఫ్‌ ఫిజీషియన్స్ ప్రకారం పెద్దలలో దీర్ఘకాలిక నిద్రలేమికి ఇది ముఖ్యమైన చికిత్స. గర్భణీ స్త్రీలు, క్యాన్సర్ సర్వైవర్‌లు,పీటీఎస్డీ ఉన్న వారిలో కూడా ఇదే సమర్థవంతంగా పని చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మందుల వల్ల కలిగే అలవాట్లు లేదా దుష్ప్రభావాలు ఈ థెరపీలో ఉండవు. 

డిజిటల్ CBT-I

నేటి కాలంలో అందరికీ థెరపిస్టులు అందుబాటులో ఉండకవచ్చు. అందుకే డిజిటల్ సీబీటీ-ఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లు ఇంట్లో కూర్చొనే నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. ఇవి పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. 

మెరుగైన నిద్ర కోసం చిట్కాలు 

రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవం అలవాటు చేసుకోవాలి. ఇది వారాంతాల్లో కూడా పాటించాలి. నిద్రకు కనీసం గంట ముందే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పక్కన పెట్టేయాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. పగటిపూట వ్యాయామం చేయడం, నిద్రకు ముందు కెఫీన్ తీసుకోకుండా ఉండటం మంచిది. నిద్రలేమి అనేది శారీరక సమస్య మాత్రమే కాదు, అది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. సరైన పద్ధతిలో చికిత్స తీసుకుంటే మందుల అవసరం లేకుండానే హాయిగా నిద్రపోవచ్చు. మీకు తీవ్రమైన నిద్ర సమస్యలు ఉంటే, వెంటనే నిపుణుడైన సీబీటీ-ఐ ప్రొవైడర్‌ను సంప్రదించడం మంచిది. 

Frequently Asked Questions

CBT-I అంటే ఏమిటి?

ఇది దీర్ఘకాలిక నిద్రలేమిని తగ్గించడానికి రూపొందించిన ఒక నిర్మాణాత్మక చికిత్స. ఆలోచనలు, ప్రవర్తన, నిద్రకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించి, నిద్రకు సహకరించే సానుకూల ధోరణిని అలవరుస్తుంది. ఇది మందుల ప్రత్యామ్నాయం.

CBT-I థెరపీ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది?

దీర్ఘకాలిక నిద్రలేమికి ఇది అత్యంత ప్రభావవంతమైన మొదటి వరుస చికిత్స. సుమారు 70-80% మందిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

CBT-I చికిత్స ఎలా పని చేస్తుంది?

ఇది కాగ్నిటివ్, బిహేవియర్, ఎడ్యుకేషనల్ అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. నిద్ర గురించి తప్పుడు ఆలోచనలను తొలగించి, బెడ్‌ను నిద్రకు మాత్రమే పరిమితం చేసేలా మనసును సిద్ధం చేస్తుంది.

CBT-I థెరపీ నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చు?

దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడే పెద్దలు, గర్భణీ స్త్రీలు, క్యాన్సర్ సర్వైవర్‌లు, పీటీఎస్డీ ఉన్నవారు దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. మందుల దుష్ప్రభావాలు లేకుండా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget