X
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 8 - 20 Oct 2021, Wed up next
SL
vs
IRE
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Diabetes: షుగర్‌ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? డైట్ తప్పనిసరిగా పాటించాలి

షుగర్ వ్యాధితో బాధపడేవారు అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. ఇంతకీ వారు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఏవి తినకూడదో ఇప్పుడు చూద్దాం.

FOLLOW US: 

డయాబెటిస్‌ సమస్యతో బాధపడుత్ను వారు తమ షుగర్‌ లెవల్స్‌‌ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. చివరకు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఏయే ఆహారాలను తినాలో, వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్‌, ఆరోగ్య కరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల ఎక్కువ సేపు తినకుండా ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి వేయదు. దీంతో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

Also Read: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకండి... మంచి నిద్ర కోసం ఏం చేయాలి?

డయాబెటిస్‌ ఉన్నవారు తినకూడనివి

పాల ఉత్పత్తులు – వెన్న తీయని హోల్‌ మిల్క్‌, చీజ్, బటర్‌
స్వీట్లు – కుకీస్‌, బిస్కెట్లు, ఐస్‌ క్రీమ్‌, ఇతర స్వీట్లు
మాంసం – మటన్‌, బీఫ్‌, పోర్క్‌
జ్యూస్‌లు – ప్యాకేజ్డ్‌ జ్యూస్‌, సోడాలు, ఇతర శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌
షుగర్‌ – తెల్లని చక్కెర
ప్రాసెస్‌ ఫుడ్స్‌ – చిప్స్‌, ప్రాసెస్‌ చేయబడిన ఆహారాలు, మాంసం

Also Read: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?

డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన ఆహారాలు

పండ్లు – యాపిల్స్, నారింజ, బెర్రీలు, జామ, పుచ్చకాయలు, బేరి పండ్లు
కూరగాయలు – బ్రోకలీ, కాలిఫ్లవర్‌, కీర దోస, పాల కూర, సొరకాయ, కాకర కాయ, బీర కాయ, టమాటాలు, బెండ కాయలు
తృణ ధాన్యాలు – ఓట్స్, బ్రౌన్‌ రైస్‌, మిల్లెట్స్‌
పప్పు దినుసులు – సోయా, చిక్కుళ్లు, బీన్స్‌, కందిపప్పు, పెసలు, శనగలు
నట్స్‌ – బాదంపప్పు, వాల్‌ నట్స్‌, పిస్తా పప్పు
సీడ్స్‌ – చియా సీడ్స్, గుమ్మడి కాయ విత్తనాలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు
ప్రోటీన్లు – కోడిగుడ్లు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు
ఆరోగ్యకరమైన కొవ్వులు – ఆలివ్‌ ఆయిల్‌, నువ్వుల నూనె

Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?

డయాబెటిస్ ఉన్న వారు తప్పనిసరిగా వైద్యులు సూచించిన డైట్ తీసుకోవాలి. డైట్‌లో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నట్స్, తృణ ధాన్యాలు, ఆలివ్‌ నూనెను ఎక్కువగా తీసుకుంటారు. చికెన్‌, చేపలు వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Health Health Tips Diabetes Diet Food Diet

సంబంధిత కథనాలు

Bacteria in Beard: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Bacteria in Beard: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Gujarat kidney : కిడ్నీలో రాళ్లు తీయమంటే .. కిడ్నీనే తీసేశాడు ! గుజరాత్‌లో డాక్టర్ పటేల్ నిర్వాకం !

Gujarat kidney :   కిడ్నీలో రాళ్లు తీయమంటే .. కిడ్నీనే తీసేశాడు !  గుజరాత్‌లో డాక్టర్ పటేల్ నిర్వాకం !

Corona Cases In India: దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు.. వైరస్ కారణంగా మరో 166 మంది మృతి

Corona Cases In India: దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు.. వైరస్ కారణంగా  మరో 166 మంది మృతి

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Beetroot Benefits: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు

Beetroot Benefits: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు

టాప్ స్టోరీస్

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..!  అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

DGP : ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

DGP :  ప్రజలు ఆవేశాలకు  గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ