News
News
వీడియోలు ఆటలు
X

ముగ్గురి ప్రాణాలు తీసిన ‘ఐ డ్రాప్స్’ - కంటి చుక్కల మందు అంత ప్రమాదకరమా?

కంటి సమస్యలు వచ్చినప్పుడు కొందరు ఐ డ్రాప్స్ వేసుకుని రిలాక్స్ అవుతారు. అయితే, అవే ఐ డ్రాప్స్ ముగ్గురి ప్రాణాలు తీశాయంటే మీరు నమ్మగలరా?

FOLLOW US: 
Share:

కంట్లో వేసుకుని చుక్కల మందు వల్ల అమెరికాలో ముగ్గురు చనిపోయారు. మరో 8 మంది అంధులయ్యారు. నలుగురికి కనుగొడ్లు తొలగించారు. అదేంటీ? కంటిని రక్షించే చుక్కల మందు అంత ప్రమాదకరమా? అసలు ఏం జరిగింది?

ఈ పరిస్థితికి కారణం ఏమిటీ?:

కంటిలో వేసుకునే చుక్కల మందులో బాక్టీరియా చేరడం వల్ల ఆ ముగ్గురు చనిపోయినట్లు అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. ఆ చుక్కల మందు వల్ల చంటి చూపును కోల్పోగా, మరో నలుగురిలో బ్యాక్టీరియా తీవ్రతరం కావడంతో కనుగొడ్లు తొలగించారు.

కళ్లలో వేసుకునే చుక్కల మందులో బ్యాక్టీరియా అవశేషాలు కనిపించాయట. ఈ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాపిస్తోందని డాక్టర్లు అంటున్నారు. యూస్ లోని ఫార్మసిలలో అమ్మే కంటిలో వేసుకునే చుక్కల మందులో సూడోమోనాస్ ఎరుగినోసా అనే రకానికి చెందిన బ్యాక్టీరియా అరుదైన జాతి ఒకటి వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చిస్తున్నారు.

ఈ రకమైన బ్యాక్టీరియా నెలలోనూ, నీటిలోనూ కనిపిస్తుంది. సాధారణంగా దీని వల్ల రక్తంలో, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇండియాలో తయారైన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఓవర్ ది కౌంటర్ అమ్ముడయ్యే ఈ ప్రొడక్ట్ ను ఫార్మసీల నుంచి యూఎస్ విజిలెన్స్ తొలగించింది. ఈ ఘటన కంటే ముందే అధికారులు ఈ చర్యలు తీసుకున్నా.. పరిస్థితి చేయిదాటిపోయింది.

న్యూయార్క్ స్టేట్ లోని కనెక్టికట్ లో ఒక సంరక్షణా కేంద్రంలో దీన్ని గుర్తించారు. ఈ సెంటర్ లోని ఇతరులకు కూడా ఈ బ్యాక్టీరియా వ్యాపించినట్లు తెలిసింది. న్యూయార్క్ టైమ్స్ చెప్పినదాన్ని బట్టి ఇన్ఫెక్షన్ సోకిన వారి శరీరాలు బ్యాక్టీరియా కాలనైజేషన్ జరిగింది. ఇది వరకెప్పుడు దేశంలో కనిపించని ఈ సూపర్ బగ్ గురించి అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

సుడోమోనాస్ ఇన్ఫెక్షన్ డ్రగ్ రెసిస్టెంట్ మాత్రమే కాదు. దానిని నిర్మూలించడం కూడా చాలా కష్టమని యూనివర్సిటి ఆఫ్ నార్త్ కరోలినా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారిలో దీన్ని వదిలించడం చాలా కష్టం. ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ తో పాటు కొన్ని ఇతర కంటిలో వేసే చుక్కల మందులు వాడిన వారి లో సుడోమోనాస్ ఇన్ఫెక్షన్ ను గుర్తించినట్టు డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు తెలియజేశారు.

బ్యాక్టీరియా ఎలా చేరింది?

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ ది కౌంటర్ మందులను పూర్తిగా నియంత్రించారు. ఇన్సిడెంట్స్ కి ముందు ఐ డ్రాప్స్ తయారయ్య ఫ్యాక్టరీలో రక్షణ చర్యల విషయంలో విఫలమవడం ఈ అవుట్ బ్రేక్ కి కారణం అయ్యిందని యూస్ అథారిటీ అభియోగిస్తోంది. చైనా, ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న మందుల పర్యవేక్షణపై అమెరికా ఎజెన్సీ ఇప్పటికే విమర్శలు ఎదుర్కోంటోంది.

సీడీసి కంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు

⦿ కంటి నుంచి పసుపు, ఆకుపచ్చ స్రావాలు రావడం

⦿ కంటి నొప్పి లేదా కళ్లు చాలా అసౌకర్యంగా ఉండడం

⦿ కన్ను లేదా కంటిరెప్పలు ఎర్రబారడం

⦿ కంట్లో ఏదో ఉన్నట్టుగా కంటి గరగరగా ఉంటుంది.

⦿ కాంతి చూడలేకపోవడం

⦿ కంటి చూపు మసకబారడం

⦿ సూడోమోనాస్ అనేది వాతావరణంలో వ్యాపించి ఉండే బ్యాక్టీరియా. ఇది నేల, నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఆర్టిఫిషియల్ టియర్స్ లో కనిపించిన ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా రక్తం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లో కనిపిస్తుంది. కొంత మంది సర్జరీ తర్వాత ఈ ఇన్ఫక్షన్ బారిన పడుతుంటారు. దీన్ని నివారించడానికి పేషెంట్లు వారిని అటెండ్ చేసే వారు తప్పనిసరిగా సబ్బు, మంచినీటితో తరచుగా కడుక్కుంటూ ఉండాలి. కలుషితమైన చేతులు, పరికరాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. సీడీసీ ప్రకారం హాస్పిటలైజ్డ్ పేషెంట్లు చాలా ప్రమాదంలోఉన్నారు. డిస్పోజబుల్ లెన్స్ ల కంటే తిరిగి వాడుకునే లెన్స్ వాడేవారిలో కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువే నని అంటున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 

Published at : 08 Apr 2023 06:00 AM (IST) Tags: Bacteria in eyedrops Pseudomonas aeruginosa contaminated eye drops EYE drops Eye drops bacteria

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!