అన్వేషించండి

Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?

ఆయుర్వేద వైద్యానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అందులోని త్రిఫల చూర్ణం సర్వరోగనివారిణిగా పేరు గాంచింది. ఇది తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని సమస్యలని తగ్గిస్తుంది.

అజీర్తి సమస్యలు వేధిస్తున్నాయా? రాత్రి నిద్ర తర్వాత జుట్టు రాలిపోవడం జరుగుతుందా? మొహం మీద ఎప్పుడు మొటిమలు వస్తూ ఇబ్బంది పెడుతున్నాయా? కావిటీస్ తో బాధపడుతున్నారా? అధిక బరువు కూడా వేధిస్తుందా? ఈ సమస్యలన్నింటికి ఒక్కటే పరిష్కారం. అదే ఆయుర్వేదంలోని త్రిఫల చూర్ణం. ఎన్నో ప్రయోజనాలు కలిగిన గొప్ప మూలికల పదార్థం. జీర్ణకోశ సమస్యల దగ్గర నుంచి దంతాలు పుచ్చిపోకుండా కాపాడే వరకు ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వ్యాధులని తగ్గించి దీర్ఘాయువుని పెంచేందుకు దీన్ని తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

త్రిఫల అంటే ఏంటి?

అమలాకి, బిభితాకి, హరితకి అనే మూడు ఆయుర్వేద మూలికల పొడి ఈ త్రిఫల చూర్ణం. ఆయుర్వేదం ప్రకారం వాటా, పిత, కఫ దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది. శక్తివంతంగా అనారోగ్యాలు లేకుండా చురుకైన జీవితాన్ని గడిపేందుకు త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. అమలాకి అంటే ఉసిరి. కాలేయ పనితీరుని నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బిభితాకి కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది. పెద్ద పేగుని శుభ్రపరుస్తుంది. శ్వాసకోశ వ్యవస్థని కాపాడుతుంది. హరితకిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ఎలా తీసుకోవాలి?

త్రిఫల పొడి, క్యాప్స్యుల్, ద్రవ రూపంలో లభిస్తుంది. ఏది ఎంచుకున్నా మంచిదే. మౌత్ వాష్, చర్మ సంరక్షణ లేదా జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించాలని అనుకుంటే దాన్ని పొడి రూపంలో తీసుకోవాలి. రుచి నచ్చకపోతే క్యాప్సూల్స్ గా తీసుకోవచ్చు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

వ్యర్థాలని తొలగిస్తుంది: పేగుల్లోని విష వ్యర్థాలని తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోజంతా శక్తి పుష్కలంగా ఉంటుంది. పెద్ద పేగు శుభ్రపడటం వల్ల అధిక బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరంలోని హానికరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటుని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం, మధుమేహం వల్ల కలిగే గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది.

కంటికి మేలు: కంటి శుక్లం, దృష్టి లోపం, గ్లకోమా వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, టానిన్లు, ఫినాల్స్, పాలీఫెనాల్స్, ఫైటో కెమికల్స్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల  జలుబు, దగ్గు, సాధారణ ఇన్ఫెక్షన్లు, అలర్జీలని నయం చేసేందుకు సహాయపడుతుంది. తెల్ల రక్తకణాల స్థాయిని పెంచుతుంది.

ఐబీఎస్ కి చికిత్స: ఇరిటేటబుల్ బవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) చికిత్సకి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అతిసారం ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ చూర్ణం తీసుకోకపోవడమే ఉత్తమం.

దంత సమస్యకి నివారిణి: యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. చిగురు వాపుని తగ్గిస్తుంది. దీని మౌత్ వాష్ గా తీసుకుంటే నోటి ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.

జుట్టు పెంచుతుంది: జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ రెమిడీని ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు చూస్తారు.

మొటిమలు తగ్గిస్తుంది: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మం మీద ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: నిద్రపోయే ముందు పాలు తాగడం మంచిది కాదా? ఎప్పుడు పాలు తాగితే మంచిది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget