అన్వేషించండి

Fact Check: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సాక్షి - వైసీపీ గెలుపుపై ఈనాడులో వార్తలు, అసలు నిజం ఏంటంటే?

NewsMeter: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎన్నికల తర్వాత వైసీపీ గెలుపు అంటూ సాక్షి, ఈనాడు ప్రచురించినట్లుగా వార్తలు వైరల్ అవుతుండగా 'న్యూస్‌మీటర్' దీనిపై క్లారిటీ ఇచ్చింది. అవి ఫేక్ అని నిర్ధారించింది.

Fact Check On Sakshi And Eenadu Posts Gone Viral: ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్  నియోజకవర్గాలకు పోలింగ్ ముగిశాయి. అంతకు ముందు రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి ప్రచారం జోరుగా నిర్వహించింది. భారీగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ముందు సాక్షి పేపర్ లో వచ్చిన కథనం 'మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు' అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు, ఎన్నికలు పూర్తైన తర్వాత ఈనాడు ప్రచురించినట్లుగా.. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థల సర్వేలు - అన్ని సర్వేల్లో వైకాపా వైపు ప్రజల మొగ్గు' అంటూ ఇంకో కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇవి రెండూ ఫేక్ అని 'న్యూస్‌మీటర్' నిర్ధారించింది.

నిజ నిర్ధారణ:

సాక్షి, ఈనాడు పేరిట వచ్చిన న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు ఫేక్ అని, సదరు వార్తా సంస్థలు అలాంటి ప్రకటనలేవీ చేయలేదని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ వైరల్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు శోధించినప్పుడు.. ఈనాడు, ఈటీవీ పేరుతో ప్రచారం అవుతున్న వార్తలు ఫేక్ అని.. సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. 'ఫేక్‍... ఫేక్‍... ఫేక్‍.. ఈనాడు పేరుతో సర్క్యులేట్‍ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా ఫేక్‍. ఈనాడు, ఈటీవీ పేర్లతో వైకాపా మూకలు ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలతో ఈనాడుకు ఎలాంటి సంబంధం లేదు' అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో మే 15న పోస్ట్ చేసింది. దీన్ని కనుగొన్నట్లు 'న్యూస్‌మీటర్' తెలిపింది.

సాక్షి పేరుతో ఫేక్ వార్త..

తర్వాత సాక్షి పేరుతో వైరల్ అవుతోన్న ఫ్రంట్ పేజీకి సంబంధించి, తాము సాక్షి కార్యాలయాన్ని సంప్రదించామని.. అది నకిలీదని వారు ధ్రువీకరించినట్లు 'న్యూస్‌మీటర్' తెలిపింది. అంతేకాకుండా, సాక్షి దినపత్రికలో ఈ వైరల్ ఫ్రంట్ పేజీ ఉందా లేదా అని వెతికినప్పుడు, అసలు ఈ వైరల్ మొదటి పేజీ కనిపించలేదని నిర్ధారించింది. 

దీంతో ఏపీకి సంబంధించి సాక్షి, ఈనాడు పేరిట సర్క్యులేట్ అవుతోన్న ఈ న్యూస్ పేపర్స్ ఫ్రంట్ ఫేజీలు ఆ సంస్థలు ప్రచురించలేదని 'న్యూస్‌మీటర్' స్పష్టం చేసింది.

This story was originally published by Newsmeter, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget