Arvind Kejriwal Fact Check: అంబేద్కర్ తాగి రాజ్యాంగం రచించారని కేజ్రీవాల్ అన్నారా? ఆప్ అధినేత ఏమన్నారంటే!
Kejriwal Comments on Ambedkar | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంబేద్కర్ మీద దారుణ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కానీ అది పరిశీలిస్తే ఫేక్ అని తేలింది.
AAP Leader Kejriwal | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతున్న ఓ వీడియోను లైట్‌హౌస్ జర్నలిజం గమనించింది. రాజ్యాంగాన్ని రచించే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మద్యం తాగి ఉన్నారని ఆప్ నేత గతంలో చెప్పినట్లు తొమ్మిది సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఇలా మాట్లాడినందుకు ఆయనను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఇందులో నిజమేంటి అనేది గుర్తించాం. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని, భారత రాజ్యాంగం గురించి కాదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్నది నిజం కాదు. ఎడిట్ చేసిన క్లిప్ అని, ఆరోపణల్లో నిజం లేదని తేలింది.
క్లెయిమ్: విభోర్ ఆనంద్ అనే ఎక్స్ యూజర్ తన ప్రొఫైల్‌లో వైరల్ వీడియోను షేర్ చేసుకున్నారు.
మరికొందరు యూజర్లు సైతం అదే వీడియో షేర్ చేశారు.
According to Arvind Kejriwal, Baba Saheb wrote the Constitution after drinking alcohol.
— Andhra Pradesh Congress Sevadal (@SevadalAPS) December 23, 2024
A Sanghi is and will always be anti-Dalit and anti-constitutional.
Kejriwal's views are so similar to those of the Sanghis, it is why he is called Chhota Sanghi!#Ambedkar pic.twitter.com/41cGIOmGXB
BR Ambedkar was drunk while writing the Constitution: @ArvindKejriwal
— Dr Vivek Chouksey (@VForU_) December 23, 2024
He should be Arrested
बाबा साहब का अपमान
नहीं सहेगा हिंदुस्तान #Ambedkar #babasahabambedkar pic.twitter.com/Qt2VxLr7Iw
పరిశీలన: ఈ వీడియోలో వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాం. అక్కడ వీడియో నలుపు, తెలుపు రంగుకు బదులుగా ఇతర రంగులలో ఉన్నట్లు లైట్‌హౌస్ జర్నలిజం కనుగొంది. వీడియో మీద రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియో కింద భాగంలో AAP క్యాప్‌లు ఉన్నట్లు గుర్తించాము. దాని ప్రకారం కేజ్రీవాల్ బహిరంగ సభలో వేదిక మీద మాట్లాడుతున్నారు. ఆ వీడియో 22 సెకన్ల నిడివితో ఉంది. కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడారు. కానీ అంబేద్కర్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
Well @ArvindKejriwal’s inspiration for doing Liquor Scam revealed by Aapiyas themselves…
— Vibhor Anand🇮🇳(हिंसक हिंदू) (@AlphaVictorVA) December 23, 2024
Jo daaru se Kare itna pyaar woh congress ko kaise karega inkaar…
🤣🤣🤣 pic.twitter.com/OCxJNBELTZ
ఇంటర్నెట్‌లో ఆ వీడియో కోసం వెతకగా ఓ వీడియో కనిపించింది. कांग्रेस का संविधान क्या कहता है? ( కాంగ్రెస్ రాజ్యాంగం ఎలా ఉంది?) అని కేజ్రీవాల్ మాట్లాడిన వీడియో డిసెంబర్ 23న అప్‌లోడ్ అయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని పరిశీలించాం. వీడియోల విభాగంలో ఫిల్డర్ చేయగా.. ఓ వీడియో కనిపించింది. 12 ఏళ్ల కిందట ఆప్ ఛానల్‌లో కేజ్రీవాల్ మాట్లాడిన వీడియో అప్ లోడ్ అయింది.
అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 4వ నిమిషంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడారు. అది ప్రత్యేకమైనదని, నూతన విధానం అన్నారు. పార్టీలకు ఒక రాజ్యాంగం ఉండటం అనేది సరికాదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం అని 4 నిమిషాల 40 సెకన్లకు ఆ విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ రాజ్యాంగం గురించి చెప్పాలంటే ఎవరూ మద్యం సేవించరని చెబుతోంది. కానీ మద్యం సేవించి ఆ రాజ్యాంగం రచించారని ఆ వీడియోలో కేజ్రీవాల్ అన్నారు.
నిర్ధారణ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్యం సేవించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని అనలేదు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడుతూ.. ఆ పార్టీ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో తప్పు ఆరోపణలతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో నిజం లేదు (False).
This story was originally published by Lighthouse Journalism as part of the Shakti Collective. This story has been Translated by ABP DESAM staff.