అన్వేషించండి

Jeeva - Yatra - 2: వామ్మో! జ‌గ‌న్ పాత్రలో నటించడానికి జీవా అన్ని కోట్లు తీసుకున్నాడా?

Jeeva - Yatra - 2: యాత్ర -2 సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఫిబ్ర‌వ‌రి 8న రిలీజైన ఈ సినిమాకి మంచి టాక్ వ‌స్తోంది. ఇక ఈ సినిమాలో జ‌గ‌న్ పాత్ర‌లో జీవ న‌టించారు.

Jeeva - Yatra - 2 Remuneration: 'యాత్ర - 2' సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 8న ఈ సినిమాని రిలీజ్ చేశారు. జ‌గ‌న్ ఫ్యాన్స్ ని ఈ సినిమా తెగ ఆక‌ట్టుకుంటోంది. సినిమా సూప‌ర్ అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించారు హీరో జీవా. వైఎస్సార్ పాత్ర‌లో మ‌మ్ముటి క‌నిపించారు. దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ జీవితం గురించి తెర‌కెక్కించిన 'యాత్ర' సినిమాకి కొన‌సాగింపుగా.. ఈ 'యాత్ర - 2' సినిమా తీశారు. వైయస్సార్ మరణం నుంచి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన పరిణామాల సమాహారమే 'యాత్ర 2'. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బ‌డ్జెట్, రెమ్యున‌రేష‌న్ గురించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. 

జీవా రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా? 

'యాత్ర', 'యాత్ర -  2' సినిమాల‌కు మహి వి రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాని దాదాపు రూ.53 కోట్ల‌తో నిర్మించార‌ట‌. ఇక ఈ బ‌డ్జెట్ లో ప్రొడ‌క్ష‌న్ కంటే.. న‌టీన‌టుల‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌కే ఎక్కువ ఖ‌ర్చు అయిన‌ట్లు ఫిలిమ్ స‌ర్కిల్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించిన జీవా దాదాపు రూ.8 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. ఇక మ‌మ్ముటి రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్, సినిమాటోగ్ర‌ాఫ‌ర్ ముగ్గురి రెమ్యున‌రేష‌న్లు క‌లిపి రూ.10 కోట్లు అని స‌మాచారం. 

ప‌ర్ఫెక్ట్ గా సెట్ అయిన జీవా.. 

త‌మిళ హీరో జీవా ముందు నుంచే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ఆయ‌న న‌టించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి.. మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు 'యాత్ర -2' లో కూడా ఆయ‌న న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్యారెక్ట‌ర్ లో ఆయ‌న ప‌ర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ‘యాత్ర 2’లో హీరోగా, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తే బాగుంటుందని మహీ వి రాఘవ ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడట. వైఎస్ జగన్ పాత్రలో జీవా సరిగ్గా సరిపోయాడని ఫస్ట్ లుక్‌ను చూసిన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు భావించారు. ఆయ‌న్ను స్క్రీన్ పైన చూసేందుకు చాలా ఎక్సైట్ అయ్యారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత జ‌గ‌న్ ఫ్యాన్స్ అంతా.. జీవాకి కూడా పెద్ద ఫ్యాన్ప్ అయిపోయార‌ట‌. వైఎస్సార్ క్యారెక‌ర్ట‌ర్ లో న‌టించిన మ‌మ్ముటి కూడా చాలా క‌రెక్ట్ గా సెట్ అయ్యారు. అది యాత్ర సినిమాలోనే తెలిసిపోయింది. ఇక ఈ ఇద్ద‌రే కాదు.. సినిమాలో ఉన్న  క్యారెక్ట‌ర్లు అన్నీ చాలా చ‌క్క‌గా కుదిరాయ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మించారు. 'యాత్ర' విడుదలైన ఫిబ్రవరి 8న ఐదేళ్ల త‌ర్వాత  'యాత్ర 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.

Also Read: మేకప్ వద్దన్నారు, జోక్ చేస్తున్నారనుకున్నా - 'దిల్ సే' మూవీపై ప్రీతి జింతా కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget