అన్వేషించండి

Yashoda: రూ.3 కోట్ల బడ్జెట్ సినిమా రూ.40 కోట్లతో తీశాం - నిర్మాత వ్యాఖ్యలు!

'యశోద' చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్స్ లో శివలెంక కృష్ణప్రసాద్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు తీశారాయన. అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో 'ఆదిత్య 369' అనే భారీ సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఇప్పుడు ఆయన నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'యశోద'. ఇందులో సమంత లీడ్ రోల్ పోషించారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. 

ప్రస్తుతం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందందాతో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నారు. అయినప్పటికీ.. ఒక వీడియో ఇంటర్వ్యూ ఇవ్వాలని భావిస్తున్నారట. మరోపక్క టీమ్ మాత్రం తమవంతు ప్రమోషన్స్ చేస్తుంది. ఇప్పటికే వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి నటులు సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారాయన. ఇద్దరు యంగ్ డైరెక్టర్లు హరి, హరీష్ చెన్నైలో తనను కలిసి కథ చెప్పారని.. ఆ సమయంలో కథలో చిన్న చిన్న మార్పులు చేయమని అడిగానని.. ఆ విధంగా ప్రాజెక్ట్ ఓకే అయిందని చెప్పారు. నిజానికి మొదట ఈ సినిమాను రూ.2.5 నుంచి రూ.3 కోట్ల బడ్జెట్ లో తీయాలనుకున్నామని.. కానీ ఎప్పుడైతే సమంతను ఆన్ బోర్డ్ చేశామో సినిమా రేంజ్ పెరిగిపోయిందని అన్నారు. 

లార్జ్ స్కేల్ లో సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు.. మొత్తం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సమంత తనకు పెద్ద కూతురు లాంటిదని.. తన వర్క్ విషయంలో ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. తన నటనతో ఎందరినో ఇన్స్పైర్ చేసిందని.. ఆమెతో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చారు. 

సాధారణంగా అయితే సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతగా తనకు చాలా టెన్షన్ వస్తుందని.. కానీ 'యశోద' అవుట్ పుట్ చూసిన తరువాత రిలాక్స్డ్ గా ఉన్నట్లు చెప్పారు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా బాగా ఆడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు వింటుంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారనిపిస్తుంది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SRIDEVI MOVIES (@sridevimovies)

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Kaaka : అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్
అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్
Karthika Deepam 2 Serial Today November 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ ప్రేమలకు సమాధి కట్టేసిన మాలిని! జ్యోత్స్న క్యారెక్టర్ చంపేసిన పారిజాతం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ ప్రేమలకు సమాధి కట్టేసిన మాలిని! జ్యోత్స్న క్యారెక్టర్ చంపేసిన పారిజాతం!
Jagadhatri Serial Today Nov 17:జగధాత్రి,కేదార్‌ గ్రూప్‌ ఫొటో దిగకుండా నిషిక, రేఖ కుట్ర...ఫొటో దిగే సమయానికి వచ్చి వాళ్లకు షాక్ ఇచ్చిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్:జగధాత్రి,కేదార్‌ గ్రూప్‌ ఫొటో దిగకుండా నిషిక, రేఖ కుట్ర...ఫొటో దిగే సమయానికి వచ్చి వాళ్లకు షాక్ ఇచ్చిన ధాత్రి
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Embed widget