అన్వేషించండి

Kaikala Satyanarayana: అంత పెద్ద నటుడిపై చిన్న చూపేలా? పద్మ అవార్డుకు కైకాల అర్హులు కాదా?

టాలీవుడ్‌లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల సహనటుడు కైకాల సత్యనారాయణకు ఇంతవరకూ పద్మ అవార్డు దక్కకపోవడం అన్యాయమని అభిమానులు అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు?

750 సినిమాలు, 63 ఏళ్ల సినీ జీవితం. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లోనే కాకుండా.. కౌబాయ్,సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ స్పై థ్రిల్లర్స్ ఇలా తెలుగు సినిమాల్లో ఉన్న అన్ని జోనర్స్‌లోనూ సినిమాలు చేసిన చరిత్ర ఆయన సొంతం. అయినప్పటికీ పద్మ అవార్డు ఒక్కసారీ దరిచేరని దురదృష్టం ఆయనది . ఆయనే మహానటుడు కైకాల సత్యనారాయణ. నవరస నటనా సార్వభౌముడు అని అభిమానుల చేతా, సత్తిగాడు అని మాస్ జనాల చేత ఆప్యాయంగా పిలిపించుకున్న సత్యనారాయణ మీద ప్రభుత్వాలు ఏ మాత్రం కరుణ చూపట్లేదు. ఆయనకంటే తర్వాత సినిమాల్లోకి వచ్చి స్థాయిలోగానీ, నటనలోగానీ ఆయన్ని అందుకోలేని కొంతమందికి అవార్డులూ పురస్కారాలూ దక్కుతుండగా.. సత్యనారాయణను మాత్రం కనీసం ఒక్క పద్మం తో నైనా గౌరవించుకోలేని స్థితిలో మనం ఉన్నామా ? తెలుగు ప్రభుత్వాలు మనసుపెట్టి సరైన దిశగా సిఫార్సు చేస్తే సత్యనారాయణ కు ఎప్పుడో రావాల్సిన పద్మ పురస్కారం కోసం 86 ఏళ్ల వయస్సులో ఇంకా ఆయన ఎదురుచూడాల్సి వస్తోంది.

యముడిగా, ఘటోత్కచుడిగా కైకాల ఇప్పటితరం పిల్లలకూ టీవీల ద్వారా సుపరిచితమే. ఇక పదేళ్ల క్రితం వరకూ అయితే సత్యనారాయణ లేని తెలుగు సినిమాలు అరుదుగా మాత్రమే ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలు..ఈస్టమన్ కలర్, గేవా, మోనో, స్టీరియో, సిక్స్ ట్రాక్, డాల్బీ, డీటీయస్ ఇలా సాంకేతికంగా తెలుగు సినిమా సాధించిన ప్రతీ మలుపుకూ సత్యనారాయణ ప్రత్యక్ష సాక్షి. హీరోగా, విలన్‌గా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా సత్యనారాయణ చెయ్యని పాత్రలేదు,  చూపించని వైవిధ్యమూ లేదు. ఎన్టీఆర్ మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకూ మూడు తరాలూ , కృష్ణ నుంచి మహేష్ బాబు వరకూ రెండు  తరాలూ , చిరంజీవి శకం నుంచి రవితేజ క్రేజ్ వరకూ తరతరాల నటుల ఎదుగుదలకు ప్రత్యక్ష సాక్షి ఆయన.

నటుడిగానే కాకా నిర్మాతగా కొదమసింహం ,బంగారు కుటుంబం ,ముద్దుల మొగుడు లాంటి సినిమాలనూ నిర్మించారాయన .అయినప్పటికీ ఆయనకు పద్మ అవార్డు వస్తుందని ప్రతీ ఏడూ ఎదురుచూడడం నిరాశపడడం కైకాల అభిమానులకు అలవాటైపోయింది. ఎన్టీఆర్ ఏఎన్నార్, కాంతారావుల తరంలో జీవించి ఉన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఒక్కరే. అయినా గానీ ప్రభుత్వ పెద్దల చూపు ఆయనపై పడడంలేదు. 

ఎంపీ కావడమే ఆయన చేసిన పాపమా?: గతంలో తనకు పద్మ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో  FDC కమీషనర్‌గా పనిచేసిన రమణాచారి, ఆ తర్వాతి సంవత్సరం సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్  సింగ్ పీఎస్సం జయ్ బారు సిఫార్స్ చేసినా.. కేవలం ఒకప్పుడు టీడీపీ ఎంపీగా పనిచేసానన్న ఒకేఒక్క కారణంతో తనకు పద్మ అవార్డు రాకుండా అడ్డుపడ్డారని ఓసారి సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. మరి రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న నటులకు ఈ అవార్డులు  ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు . నిజానికి కైకాల సత్యనారాయణ అనుభవానికి, ప్రజ్ఞకు, సినీరంగానికి ఆయన చేసిన సేవకు ఇలాంటి పురస్కారాలు ఎన్నడో రావాల్సి ఉన్నా ప్రభుత్వాల చిత్తశుద్ధి లేక  దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటన్నా కైకాల సత్యనారాయణకు వస్తుందా లేదా అని కైకాల అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే కైకాల సత్యనారాయణ మాత్రం ఈ పురస్కారాలూ, అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానం, చప్పట్లే తనకు దక్కిన  నిజమైన అవార్డులని అంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget