By: ABP Desam | Updated at : 14 Dec 2022 09:41 AM (IST)
'వాల్తేరు వీరయ్య'లోని 'బాస్ పార్టీ...' పాటలో చిరంజీవి, ఊర్వశి రౌతేలా
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో మెగా వీరాభిమానులలో ఒకరైన బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). సంక్రాంతి బరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 13న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. హీరోలు ఇద్దరి క్యారెక్టర్లు పరిచయం చేస్తూ టీజర్లు విడుదల చేశారు. బాస్ పార్టీ సాంగ్ మెగా అభిమానులకు నచ్చింది. అయితే... అసలు పార్టీ విశాఖలో ప్లాన్ చేశారట.
విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్
Waltair Veerayya Pre Release Function : జనవరి 8న విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అంతే కాదు... మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.
విశాఖ నేపథ్యంలో సినిమా రూపొందింది. వాల్తేరు విశాఖలో ఉంది. ఆ ఏరియా మనిషిగా చిరంజీవి సినిమాలో కనిపించనున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... ఆయన తమ్ముడిగా రవితేజ తెలంగాణ వ్యక్తిగా కనిపించనున్నారట. ఈ రిలేషన్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి.
Also Read : బాలయ్య షోలో ప్రభాస్ పెళ్లి టాపిక్ - ఎప్పుడో చెప్పిన రామ్ చరణ్, గోపీచంద్
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో విదేశాల్లో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఆ సాంగ్ ఫినిష్ చేసుకుని ఇండియా రానున్నారు. ఇక... రవితేజ జోడీగా కేథరిన్ కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య ఘాటు లిప్ లాక్ ఉందని తెలిసింది. ఈ మధ్య ఆ సీన్ షూట్ చేశారట.
రీసెంట్‌గా రవితేజ క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ''ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నది'' అంటూ మాస్ మహారాజ పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. ఓ చేత్తో మేకపిల్లను పట్టుకుని, మరో చేత్తో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ లాగుతూ... రవితేజ చేసిన ఫైట్ సినిమాపై అంచనాలు పెంచింది. 'ఏం రా... వారి... పిస పిస చేస్తున్నావ్! నీకింకా సమజ్ కాలే! నేను ఎవని అయ్యకూ విననని!' అని రవితేజ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
CM KCR Nanded Tour: నేడే నాందేడ్లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా