By: ABP Desam | Updated at : 07 Feb 2023 03:48 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Netflix India South/Twitter
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతరే చేసిందని చెప్పాలి. ఈ మూవీకు బాబీ దర్శకత్వం వహించారు. రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, అన్నదమ్ముల సెంటిమెంట్, డైలాగ్స్, ఫైట్స్ ముఖ్యంగా వింటేజ్ చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. థియేటర్ లో లాంగ్ రన్ లో సినిమాను ప్రదర్శించారు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో శరవేగంగా సినిమాలు చేస్తున్నారు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాల్లో నటిస్తూ దట్ ఈజ్ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అప్పటిదాకా నటించిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో చిరంజీవి నటన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతగా చిరంజీవి కథను నమ్మి ఈ సినిమాను చేశారు. దర్శకుడు బాబీ కూడా స్వతహాగా చిరంజీవి వీరాభిమాని కావడంతో అభిమానులకు ఏం కావాలో అదే తెర మీద కూడా తీర్చిదిద్దాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై మెగా జాతర మొదలైంది. దీనికి తోడు సినిమాలో రవితేజ కూడా ప్రత్యేక పాత్రలో నటించడం, స్క్రీన్ పై చిరంజీవి, రవితేజ మధ్య అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అవ్వడంతో సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది.
ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులకు మంచి వార్తను అందించింది మూవీ టీమ్. ఈ మూవీను ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 27న ఈ మూవీను డిజిటల్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేయనున్నారు. ఆయన తదుపరి ‘భోళా శంకర్’ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకు సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు మేకర్స్.
Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?
In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB
— Netflix India South (@Netflix_INSouth) February 7, 2023
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !