అన్వేషించండి

Prabhas Engagement: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?

ప్రభాస్, కృతి సనన్ త్వరలో ఒక్కటి కాబోతున్నారా? వీరిద్దరి నిశ్చితార్థం మాల్దీవుల్లో జరగబోతోందా? పెళ్లిపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం ఎంత?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఆయన, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని సినీ జనాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ జంట చూడ ముచ్చటగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. కానీ, ప్రస్తుతం అనుష్క ప్లేస్ లోకి కృతి సనన్ వచ్చి చేరింది. ప్రభాస్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిని ప్రభాస్, కృతి అవాస్తవం అని తేల్చి చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు.

మాల్దీవుల్లో ప్రభాస్, కృతి నిశ్చితార్థం?

తాజాగా ప్రభాస్, కృతి సనన్ త్వరలో ఎంగేజ్ మెంట్ జరుపుకోబోతున్నారంటూ బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్ సంచలనం అయ్యింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ హల్ చల్ చేసింది. “బ్రేకింగ్ న్యూస్: కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది” అంటూ ఉమైర్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తప్పుడు వార్త అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా, నిజమేనా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఉమైర్ సంధు చేసే ట్వీట్లు చాలా వరకు వివాదాస్పదంగానే ఉంటాయి. బాలీవుడ్ నటీనటులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైనా ఆయన ట్వీట్స్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆయనపై కేసు పెట్టిన సందర్భాలున్నాయి. 

కృతి-ప్రభాస్ ప్రేమాయణంపై వరుణ్ ధావన్ కీలక వ్యాఖ్యలు

 కాసేపు ఉమైర్ సంధు ట్వీట్ గురించి పక్కన పెడితే, ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ప్రస్తావించాడు. కృతి సనన్, ప్రభాస్ రిలేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ షోలో ఆయన ఆసక్తికర విషయం చెప్పాడు.  కృతి సనన్ ప్రస్తుతం దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తున్న భారీ ప్రాజెక్టు హీరోతో ప్రేమలో ఉందని చెప్పాడు. ఇంతకీ దీపికా చేస్తున్న పెద్ద ప్రాజెక్టు హీరో ఎవరని పరిశీలిస్తే, తను ప్రభాస్. దీపిక, ప్రభాస్ కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృతి, ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు నిజమేనని తేలినట్లైంది.

ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాడు - రామ్ చరణ్

తాజాగా ప్రభాస్, బాలయ్య అన్‌స్టాపబుల్‌ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ చిన్న హింట్ ఇచ్చాడు. త్వరలోనే ప్రభాస్ నుంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పాడు. ఆ గుడ్ న్యూస్ కృతి, ప్రభాస్ పెళ్లేనని ఇప్పుడు అర్థం అవుతోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’ ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!

టాప్ హెడ్ లైన్స్

GDN Trailer Review : మిరాకిల్ మ్యాన్‌గా మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ లైఫ్ స్టోరీ... ట్రైలర్ చూశారా?
మిరాకిల్ మ్యాన్‌గా మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ లైఫ్ స్టోరీ... ట్రైలర్ చూశారా?
Rao Bahadur Collections Day 2 : రావు బహదూర్ రెండు రోజుల కలెక్షన్స్ - బాక్సాఫీస్ వద్ద అదే జోష్... ఓవర్సీస్‌లో ఎంతంటే?
రావు బహదూర్ రెండు రోజుల కలెక్షన్స్ - బాక్సాఫీస్ వద్ద అదే జోష్... ఓవర్సీస్‌లో ఎంతంటే?
Hrithik Roshan : హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget