Waltair Veerayya Movie Song : మెగాస్టార్ లీక్ చేసిన సాంగ్ - ఒరిజినల్ & ఫుల్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ
Nuvvu Sridevi Nenu Chiranjeevi Song : 'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి, శృతి హాసన్ మీద ఈ మధ్య ఫారిన్‌లో ఓ సాంగ్ షూట్ చేశారు. దానిని ఎప్పుడు విడుదల చేస్తున్నదీ ఈ రోజు చెప్పారు.
![Waltair Veerayya Movie Song : మెగాస్టార్ లీక్ చేసిన సాంగ్ - ఒరిజినల్ & ఫుల్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ Waltair Veerayya Movie Second Single Nuvvu Sridevi Nenu Chiranjeevi Releasing on December 19th Cast Chiranjeevi Shruti Haasan Waltair Veerayya Movie Song : మెగాస్టార్ లీక్ చేసిన సాంగ్ - ఒరిజినల్ & ఫుల్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/d49afce9d416430757e960ff0ce1d67c1671275689398313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో దర్శక - నిర్మాతలకు ఓ సమస్య ఉంది. అది ఏంటంటే... 'మెగా' లీక్స్! చిరంజీవి ఏదో వేడుకకు వెళ్ళడం, మాటల మధ్యలో అఫీషియల్‌గా యూనిట్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడానికి ముందు సినిమా కబురు చెప్పడం ఆయన స్టైల్. ముందు ట్రోల్స్ వచ్చాయి. 'మెగా' లీక్స్ అంటూ చిరంజీవి స్వయంగా కొత్త కబుర్లు చెప్పడం స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఆల్రెడీ ఓ సాంగ్ విడుదల చేశారు. చిరంజీవితో ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేసిన ఆ పాట స్పెషల్ సాంగ్. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళిద్దరిపై విదేశాల్లో పాటలు చిత్రీకరిస్తున్నారు. అందులో ఓ పాట... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట'.
డిసెంబర్ 19న 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి'
Nuvvu Sridevi Nenu Chiranjeevi Song : 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి' పాటను ఈ నెల 19న... అనగా సోమవారం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. యూరప్‌లో అందమైన లొకేషన్స్‌లో... మంచు పడుతున్న సమయంలో కొండల్లో షూట్ చేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. చిరు లీక్ చేసిన పాటలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ ఉంది. సాంగ్ మొత్తం ఆయనే పాడారా? లేదంటే ఇంకొకరితో పాడించారా? అనేది సోమవారం తెలుస్తుంది.
మాస్ మహారాజా రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి మెగా వీరాభిమానులలో ఒకరైన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్
Waltair Veerayya Pre Release Function : జనవరి 8న విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అంతే కాదు... మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.
Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు
View this post on Instagram
విశాఖ నేపథ్యంలో సినిమా రూపొందింది. వాల్తేరు విశాఖలో ఉంది. ఆ ఏరియా మనిషిగా చిరంజీవి సినిమాలో కనిపించనున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... ఆయన తమ్ముడిగా రవితేజ తెలంగాణ వ్యక్తిగా కనిపించనున్నారట. ఈ రిలేషన్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి. ఇందులో రవితేజ జోడీగా కేథరిన్ కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య ఘాటు లిప్ లాక్ ఉందని తెలిసింది. ఈ మధ్య ఆ సీన్ షూట్ చేశారట.
Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)