(Source: ECI/ABP News/ABP Majha)
Vishnu Manchu Fight : సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌తో విష్ణు మంచు ఫైట్
అందాల భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌తో విష్ణు మంచు ఫైట్ చేశారని తెలిసింది. 'జిన్నా' సెట్స్‌లో ఆ ఫైట్ జరిగిందట!
సన్నీ లియోన్ (Sunny Leone) కు శృంగార తార ఇమేజ్ ఉంది. గతంలో ఆమె ఏయే సినిమాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇక, పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్త చెప్పేది ఏముంది? 'ఆర్ఎక్స్ 100' సినిమాలో గ్లామర్ షోతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్నారు. వాళ్ళిద్దరినీ చాలా మంది గ్లామర్ డాల్స్‌గా చూశారు. అయితే... వాళ్ళలో యాక్షన్ స్కిల్స్‌ను 'జిన్నా సినిమా బయట పెడుతుందని తెలిసింది.
Vishnu Manchu Fights With Sunny Leone Payal Rajput : విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' (Ginna Movie) సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇదొక హారర్ కామెడీ సినిమా! అయితే... ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక సన్నివేశంలో హీరోయిన్లతో విష్ణు మంచు ఫైట్ చేశారని తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫైట్ చేసిన తర్వాత పెర్ఫ్యూమ్స్ ఏవీ వర్క్ చేసేవి కాదని, అందరూ శరీరాలు చెమటతో నిండిపోయేవని సమాచారం.
దీపావళికి 'జిన్నా' విడుదల!
దీపావళి కానుకగా ఈ నెల 21న 'జిన్నా' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే, ఆల్రెడీ కొంత మంది సినిమా చూశారు. కుటుంబ సభ్యులకు సినిమాను స్పెషల్‌గా చూపించారు విష్ణు మంచు. (Ginna Movie Review ) సినిమా చూశాక... ఆ రోజు రాత్రి తన కుమార్తె రాత్రి నిద్రపోలేదని, పదిసార్లు నిద్రలోంచి లేచిందని, భయపడిందని లక్ష్మీ మంచు (Lakshmi Manchu) పేర్కొన్నారు. ఇంటర్వెల్ టైమ్‌లో విష్ణు మంచుతో ''థాంక్యూ... థాంక్యూ... ఇప్పుడు నేను నిద్రపోలేను'' అని విద్యా నిర్వాణ (Vidya Nirvana Manchu Anand) చెప్పిందట. విష్ణు కుమార్తెలు అరియనా, వివియనా బాగా ఎంజాయ్ చేశారట. సినిమా చూసిన మంచు ఫ్యామిలీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉందని తెలిసింది.
'చంద్రముఖి' తరహాలో కామెడీగా...
Vishnu Manchu On Ginna Movie Genre : 'చంద్రముఖి' జానర్‌లో 'జిన్నా' ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. 'చంద్రముఖి' డార్క్ కామెడీ జానర్ అయితే... అటువంటి చిత్రమే 'జిన్నా' అని ఆయన తెలిపారు. ఆ సినిమాకు మించి కామెడీ 'జిన్నా'లో ఉందన్నారు. అలాగే, థ్రిల్ కూడా ఉంటుందట.
సన్నీ లియోన్... పాయల్...
ఇద్దరిలో దెయ్యం ఎవరు?
ట్రైలర్‌లో క్యారెక్టర్లు రివీల్ చేశారు గానీ కథేంటో చెప్పలేదు. టెంట్ హౌస్ ఓనర్‌గా విష్ణు క్యారెక్టర్ చూపించారు. ఆయన ఊరంతా ఎందుకు అప్పులు చేశారనేది సస్పెన్స్‌లో ఉంచారు. హీరోయిన్లు పాయల్, సన్నీలో దెయ్యం ఎవరనేది రివీల్ చేయలేదు. 'జిన్నా' చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇటీవల టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 'నా పేరు జిన్న రా.... అందరికి అన్న రా' అంటూ సాగే ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది. విష్ణు కుమార్తెలు అరియనా, వివియయా పాడిన ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది.
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో AVA ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ, కోన వెంకట్ స్క్రిప్ట్ అందించారు. కోన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.