By: ABP Desam | Updated at : 12 Feb 2022 10:56 AM (IST)
షూటింగ్ లో గాయపడ్డ హీరో
కోలీవుడ్ హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాద్ లో 'లాఠీ' సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. విలన్ బారి నుంచి చిన్నారిని కాపాడే సన్నివేశంలో భాగంగా హీరో బిల్డింగ్ మీద నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడి చేతికి, నుదుటికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో విశాల్ షూటింగ్ కి బ్రేక్ చెప్పి ట్రీట్మెంట్ కోసం కేరళకు వెళ్లారు.
చేతికి చిన్న ఫ్రాక్చర్స్ కావడంతో షూటింగ్ ను మార్చి నెలకు వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చేతికి ఫ్రాక్చర్ అవడంతో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎలా గాయమైందో వీడియో కూడా షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అలానే విశాల్ చేతిలో ఉన్న ఆ చిన్నారి బాగానే ఉన్నాడా..? లేదా..? అని ఆరా తీస్తున్నారు. ఇలాంటి రిస్కీ సీన్స్ లో నటించొద్దంటూ విశాల్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
సునయన హీరోయిన్ గా నటిస్తుండగా.. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నంద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విశాల్ నటించిన 'సామాన్యుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం 'లాఠీ' సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
/body>