By: ABP Desam | Updated at : 20 Dec 2022 08:58 AM (IST)
'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలో కిరణ్ అబ్బవరం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సినిమాలో తొలి పాటను మాత్రమే ఈ ఏడాది, క్రిస్మస్ ముందు రోజు విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 24న 'వాసవ సుహాస'
Vaasava Suhaasa Lyrical From Vinaro Bhagyamu Vishnu Katha : 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంలో తొలి పాట 'వాసవ సుహాస'ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఆ రోజు సాయంత్రం 6.19 గంటలకు లిరికల్ వీడియో విడుదల కానుంది.
ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... ఫిబ్రవరి 17, 2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.
'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... 'మాకు ఏడు వింతల గురించి పెద్దగా తెలియదు అన్నా! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి'' అని టీజర్ లో కిరణ్ అబ్బవరం డైలాగ్ చెప్పారు. అంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో... వెనుక దేవాలయం, ముందు బసవన్నతో కిరణ్ అబ్బవరం - పండుగ సమయంలో వచ్చే సన్నివేశంలో స్టిల్ టైపులో ఉంది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి స్టైల్ వైవిధ్యంగా ఉంది.
Also Read : ‘తన పేరును కూడా నా పేరులో పెట్టుకోవచ్చు’ - 18 పేజెస్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్!
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'సెబాస్టియన్', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ అయ్యాయి. కానీ, ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆయన కలెక్షన్స్ సాధించారు. ఆ రెండు చిత్రాల మధ్యలో వచ్చిన 'సమ్మతమే' కాస్త పర్వాలేదనే పేరు తెచ్చుకుంది. అందుకని, ఎట్టి పరిస్థితుల్లోనూ 'వినరో భాగ్యము విష్ణు కథ'తో తప్పకుండా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
Also Read : పెళ్లి తర్వాత నయనతారలో ఎంత మార్పు? ఆ ఒక్క రూల్ బ్రేక్ చేసిన బ్యూటీ
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.
Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్
Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!
Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక