Vijay Sethupathi: అంతలోనే ఇంత మార్పా? విజయ్ సేతుపతిని చూశారా ఎంత మారిపోయారో!
సాధారణంగా విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఎప్పటిలాగా కంటే చాలా సన్నగా..
తమిళ నటుడు విజయ సేతుపతికి ఇప్పుడు దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఒక సాధారణ అకౌంటెంట్ గా జీవితాన్ని ప్రారంభించిన సేతుపతి.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ఆస్కారం ఉన్న ప్రతి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌గా సైతం తన సత్తా చాటుతున్నారు.
విజయ్ తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన్ను తన అభిమానులు మక్కళ్ సెల్వన్ అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దానిపై అటు అభిమానులు ఇటు సినీ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.
సాధారణంగా విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఎప్పటిలా కాకుండా.. చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఎవరూ ఊహించని కొత్త లుక్ లో స్లిమ్ గా కనిపిస్తూ అందర్నీ షాక్ కు గురిచేశారు విజయ్. ఈ ఫోటో చూస్తుంటే డ్రెసింగ్ రూమ్ లో మిర్రర్ లో తీసుకున్న ఫోటోలా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ తీసుకున్న ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
View this post on Instagram
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో విజయ్ సేతుపతి చాలా సన్నగా ఉండేవారు. ఆ తర్వాత మెల్లగా బరువు పెరుగుతూ వచ్చారు. దీంతో హీరో పాత్రాలు రావడం తగ్గిపోయింది. బరువు పెరగడం వల్లే విజయ్‌కు విలన్ పాత్రలు వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి తన లేటెస్ట్ స్లిమ్ ఫోటోతో విమర్శలకు చెక్ పెట్టాడని అంటున్నారు ఆయన అభిమానులు. విజయ్ ఇప్పుడు ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దంగా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.
Also Read: మెగాస్టార్ సినిమాలో రవితేజ ఘాటు లిప్ లాక్ - ఎవరితో అంటే?
విజయ్ సేతుపతికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. ఆయనకు ఒక్క తమిళ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. హీరో, విలన్ అని తేడా లేకుండా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు విజయ్. నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అందుకే ఆయన సినిమాాలు అంటే ఎగబడి చూస్తారు ప్రేక్షకులు. విజయ్ సేతుపతి గతంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' చిత్రంలో కూడా విలన్ గా కనిపించాడు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘విక్రమ్’ సినిమాలో విలన్ గా నటించారు విజయ్. ఈ సినిమాలో కూడా ఆయన విలక్షణ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. విలన్ గా చేస్తున్నప్పటకీ విజయ్ సేతుపతి కి పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకూ ఆయన పాపులారిటీ మరింత పెరుగుతుండటం గమనార్హం.
విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మైఖేల్, మేర్రీ క్రిస్మస్, ముంబైకర్ సినిమాలతో పాటు కొన్ని భారీ ప్రాజెక్టులు విజయ్ చేతిలో ఉన్నాయి.