By: ABP Desam | Updated at : 03 Dec 2022 07:38 PM (IST)
'వారసుడు' సినిమాలో విజయ్... శింబు
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కథానాయకుడిగా, రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న సినిమా 'వారసుడు'. తమిళ సినిమా 'వారిసు' (Varisu) కు తెలుగు అనువాదమిది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇంకా అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు గానీ... ఆ రోజు విడుదల కావడం పక్కా! ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
థీ దళపతి పాడిన శింబు
1Varisu Second Single : 'వారిసు'లో రెండో పాట 'థీ దళపతి...' (Thee Thalapathy song) ని శింబు ఆలపించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆ పాట విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు థాంక్స్ చెప్పింది. ఆయన వాయిస్ వల్ల సాంగ్ మరింత స్పెషల్‌గా మారిందని పేర్కొంది.
రికార్డులు క్రియేట్ చేస్తున్న 'రంజితమే'
'వారిసు' సినిమాలో తొలి పాట 'రంజితమే...' రికార్డులు క్రియేట్ చేస్తోంది. తమిళ వెర్షన్ మూడు వారాల క్రితం పాట విడుదల కాగా... ఇప్పటి వరకు 75 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. రెండు మిలియన్స్‌కు పైకా లైక్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్ 'రంజితమే...'కు 1.5 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 'రంజితమే...' పాటను విజయ్ పాడారు. తెలుగులో ఈ పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫిమేల్ లిరిక్స్ మాత్రం తమిళంలో పాడిన ఎంఎం మానసి తెలుగులో కూడా పాడారు. తెలుగు పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ ఈ పాటకు బాణీ అందించిన సంగతి తెలిసిందే.
Also Read : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా