News
News
వీడియోలు ఆటలు
X

Vijay Devarakonda: ‘శాకుంతలం’కి విజయ్ విషెస్ - నా హీరో అంటూ సమంత రిప్లై!

‘శాకుంతలం’ సినిమాకు విజయ్ దేవరకొండ విషెస్ చెప్పారు.

FOLLOW US: 
Share:

సమంత నటించిన భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమా రేపు (ఏప్రిల్ 14వ తేదీ) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ‘శాకుంతలం’కి విజయ్ దేవరకొండ విషెస్ చెప్పారు.

‘సమంత, నీలో ఎంతో ప్రేమ దాగి ఉంది. సరైన పని చేయాలని, ఆనందాన్ని పంచాలని నువ్వు ఎప్పుడూ కోరుకుంటావు. సినిమాలో ప్రతి షాట్‌కి నువ్వు ఎంతో కష్టపడతావు. నీ కెరీర్ మొత్తం దాని మీదనే ఆధారపడి ఉన్నది అన్నట్లు కష్టపడతావు. గత సంవత్సర కాలంలో నువ్వు ఎంత పోరాడావో ప్రపంచానికి తెలియకపోవచ్చు. నీ శరీరానికి బ్రేక్, రెస్ట్ అవసరమైనప్పటికీ నీ టీమ్ కోసం, నీ సినిమా కోసం ముఖం మీద నవ్వు పులుముకుని ఉండటానికి ప్రయత్నించావు. శాకుంతలం సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీ గుండె ధైర్యం, కోట్లాది ప్రజల ప్రేమ నిన్ను సురక్షితంగా ఉంచుతుంది.’ అని విజయ్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దానికి సమంత స్పందిస్తూ ‘ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నిజంగా నాకు ఇది అవసరం. థ్యాంక్యూ మై హీరో.’ అని రిప్లై ఇచ్చారు. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' రిలీజ్ డేట్ దగ్గరికొచ్చేసింది. సమంత ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సమయానికి మరో 24గంటలే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో.. అంత కన్నా రెట్టింపు కష్టం సమంత పడింది. మెంటల్ గా ఎన్ని ఎమోషన్స్ అడ్డొచ్చినా.. ఫిజికల్ గా ఇటీవలే ఓ వ్యాధి నుంచి బయటపడి మళ్లీ ఫిట్ గా ఉండేందుకు సాయ శక్తులా కృషి చేసింది. అలసటను, విచారాన్ని ఎక్కడా కనిపించకుండా ఇప్పటికీ ఆ చిన్న స్మైల్ తోనే  అందర్నీ ఆకట్టుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసిందంటే మాటలు కాదు.

అంత గొప్ప గౌరవమూ అందరికీ దక్కదు. కొన్ని సినిమాలు చేసే అందరికీ అవకాశం రావు. కానీ సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది కూడా. అందుకే ఆ గౌరవానికి ప్రతీకగా తాజాగా ఇన్స్ స్టా పోస్ట్ చేసింది.  దాంతో పాటు ఓ ఫొటోను షేర్ చేసిన సమంత... ప్రముఖ హీరోయిన్లు, వాళ్లు నటించిన పాత్రల పక్కన తన ఫొటోను పెట్టడంపై ఆనందం వ్యక్తం చేసింది. నిజంగా గౌరవంగా ఫీలవుతున్నానంటూ రాసుకొచ్చింది. 'శాకుంతలం' రేపట్నుంచి ఇక మీదే నంటూ ఓ ఎమోషనల్ కోట్ ను కూడా సమంత యాడ్ చేసింది.

ఇక సమంత నటించిన 'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు.. దుష్యంత్ పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. ప్రిన్స్ భరత్‌గా నటించింది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 14న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Published at : 13 Apr 2023 11:20 PM (IST) Tags: Vijay Devarakonda Shaakuntalam Samantha

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి