అన్వేషించండి

Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా

Vidyut Jamwal nude pics in Instagram post: విద్యుత్ జమ్వాల్ ఇన్ స్టాలో షాకింగ్ ఫోటోలు షేర్ చేశారు. ఒంటి మీద బట్టలు లేకుండా హిమాలయాల్లో గడుపుతూ కనిపించారు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Vidyut Jamwal Himalayan Retreat: బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’, ‘తుపాకి’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ మూవీస్ లో తమ మార్క్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా యాక్షన్ మూవీ ప్రియులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘షేర్ సింగ్ రాణా’ కాగా, మరొకటి ‘క్రాక్’ మూవీ. ఈ రెండు సినిమాలు యాక్షన్ థ్రిల్లర్స్ గా రూపొందుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

‘క్రాక్’ సినిమాలో సీబీఐ డీసీపీ అర్జున్ సింధియాగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ 2024 ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ప్యాచ్ వర్క్ కూడా నడుస్తోంది.

హిమాలయాల్లో దుస్తులు లేకుండా విద్యుత్

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ నుంచి విద్యుత్ జమ్వాల్ కు కాస్త విరామం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన హిమాలయాలకు వెళ్లారు. అక్కడ ఒంటరిగా విహరిస్తున్నారు. తాజాగా తన హిమాలయ పర్యటనకు సంబంధించి ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. హిమాలయ వనాల్లో ప్రపంచంతో సంబంధం లేకుండా జీవితాన్ని గడుపుతూ కనిపించారు. అతి సాధారణ వ్యక్తి మాదిరిగా తన కోసం వంట చేసుకుంటున్నారు. ఈ ఫోటోల్లో తను ఓ యోగిలా దర్శనం ఇచ్చారు. పారుతున్న నీళ్లలోకి దిగి సూర్య నమస్కారాలు చేయడం, చెట్ల కర్రలతో వంట చేయడం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.    

Also Read: పాపం... ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

సాధవులా జీవించడంలోనే సంతోషం ఉంది- విద్యుత్

ఈ ఫోటోలను షేర్ చేస్తూ విద్యుత్ జమ్వాల్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి ఏటా కనీసం వారం నుంచి 10 రోజుల పాటు హిమాలయాల్లో సేద తీరుతానని చెప్పారు. విలాస జీవితాన్ని వదిలా ఓ సాధువులా జీవించడంలోనే సంతోషం ఉంటుందన్నారు. ప్రకృతిలోని ప్రతి అణువులో ఎంతో శక్తి ఉందన్నారు. ఆ శక్తిలో మరింత లగ్జరీ లైఫ్ కనిపిస్తుందన్నారు. ప్రకృతితో తనను తాను అణ్వేషించుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉందన్నారు. “నేను గత 14 ఏండ్లుగా ఇలాంటి దైవ చింతన గడుపుతున్నాను. విలాసవంతమైన జీవితం నుంచి అటవీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నా గురించి నేను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రకృతి నిశ్శబ్దంలో నా గురించి నేను తెలుసుకుంటున్నాను. కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తాను. కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతాను. ఏకాంతం అనేది ఎంతో అమూల్యమైనది. అనుభవపూర్వకంగా మాత్రం ప్రకృతి గొప్పదనం తెలుస్తుంది. మళ్లీ మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉంటాను” అని విద్యుత్ వెల్లడించారు. ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలను స్థానిక గొర్రెల కాపరి  మోహర్ సింగ్ తీసినట్లు వివరించారు.

Read Also: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి
ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి
Amazon And Flipkart Sellers : ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌సహా 19 ప్రాంతాల్లో సోదాలు
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌ సహా 19 ప్రాంతాల్లో సోదాలు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Embed widget