అన్వేషించండి

Renu Desai: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం

Renu Desai: నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డం మానుకోవాలని రేణూ దేశాయ్ సూచించారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి జర్నలిస్టులకు ఏం పని అని ఆమె ప్రశ్నించారు.

Renu Desai On Social Media And Journalism: సినీ నటీనటుల గురించి మీడియాలో తరచుగా గాసిన్స్ వస్తుంటాయి. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి వార్తలు ప్రసారం అవుతాయి. వాటిలో కొన్ని వార్తలు నిజానికి దగ్గరగా ఉంటాయి. మరికొన్ని మాత్రం తలాతోకా లేకుండా ఉంటాయి. అంతేకాదు, సదరు నటీనటుల వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేవిగా ఉంటాయి. ఇలాంటి వార్తలపై చాలా మంది స్టార్స్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సినీ తారల వ్యక్తిగత జీవితాలపై పుకార్లు పుట్టించే వారిపై నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

అలాంటి రాతలు మంచిది కాదు- రేణూ దేశాయ్

సినీ నటుల పర్సనల్ లైఫ్ గురించి అడ్డగోలు వార్తలు రాయడం నిజమైన జర్నలిజం అనిపించుకోదని రేణూ దేశాయ్ వెల్లడించింది. ఇలాంటి పద్దతి మార్చుకోవాలని ఆమె సూచించింది. “సినీ తారల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడ్డం కరెక్టా? సమాజానికి, సమాజంలోని శాంతి భద్రతలకు సినీ తారల జీవితాలు ఏమైనా విఘాతం కలిగిస్తున్నాయా? సినిమా రిలీజ్ అయినప్పుడు జర్నలిస్టులు, సినీ విశ్లేషకులు సినిమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. వాళ్ల ఒపీనియన్ ను మేము భావ ప్రకటన స్వేచ్ఛగా భావిస్తాం. కానీ, మా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం సరికాదు” అని వెల్లడించింది.

మా జీవితాల గురించి మీరెందుకు మాట్లాడాలి?- రేణూ దేశాయ్

సోషల్ మీడియా ఉంది కదా అని తమ గురించి లేనిపోని వార్తలను క్రియేట్ చేయడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని రేణూ దేశాయ్ మండిపడింది. “కొంత మంది పని లేనివాళ్లు సోషల్ మీడియాలో మా వ్యక్తిగత జీవితాల గురించి అబద్దపు విషయాలు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సృజనాత్మకత కలిగిన వారు ఉన్నారు. వారిలో చాలా మంది సున్నితత్వం కలిగి ఉన్నారు. వారంతా బుక్స్, సాంగ్స్ రాయడం, పెయింటింగ్స్ వేయడం, సినిమాలు తీయడం మానేస్తే ఎలా ఉంటుదో ఓసారి ఊహించుకోండి. అందరి జీవితాల మాదిరిగానే మా వ్యక్తిగత జీవితాల్లోనూ సమస్యలు ఉంటాయి. ప్రేమను ఆస్వాదించిన క్షణాలు, మనసు క్షోభకు గురైన సందర్భాలు ఉన్నాయి. మేమూ జీవితంలో కొన్ని తప్పులు చేస్తాం. ఆయా కారణాలతో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. నా జీవితం గురించి నేను మాట్లాడ్డం నా ఇష్టానికి సంబంధించిన విషయం. కానీ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కొంత మంది ఊహాగానాలు సృష్టించడం మంచిది కాదు. ఎదుటి వారి సమస్యల గురించి మాట్లాడి సంపాదించుకునే డబ్బులు ఒంటికి మంచిది కాదు అని గుర్తుంచుకోవాలి” అని రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

రీసెంట్ గా రేణూ దేశాయ్ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె హేమలత లవణం పాత్రను పోషించింది. తాజాగా ఓ జర్నలిస్టు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన రేణు, తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Read Also: నెట్టింట్లో త్రిప్తికి ఫుల్ క్రేజ్, ‘యానిమల్‌’ తర్వాత ఓ రేంజ్​లో పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget