Venkatesh: 'ఓరి దేవుడా'లో గెస్ట్ రోల్ - వెంకీ ఎంత ఛార్జ్ చేశారో తెలుసా?
'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి వెంకటేష్ ఎంత ఛార్జ్ చేశారో తెలుసా..?
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Movie). రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెజారిటీ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చింది. తమిళంలో అశోక్ సెల్వన్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఇదొక ఫాంటసీ ఫిల్మ్. ఇందులో దేవుడి పాత్ర కూడా ఉంది.
తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేశారు. దేవుడు అనగానే కిరీటం, స్వర్గం వంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మోడ్రన్ మనిషిలా ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించినట్లు విశ్వక్ సేన్ సినిమాలో వెంకటేష్ అలా కనిపించారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగానే పండింది.
ఈ పాత్ర చేయడానికి వెంకటేష్ ఎంత ఛార్జ్ చేశారో తెలుసా..? అక్షరాల రూ.3 కోట్లు. ఈ సినిమా కోసం వెంకీ కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు. వర్కింగ్ డేస్ తో కంపేర్ చేస్తే.. మూడు కోట్ల రెమ్యునరేషన్ చాలా ఎక్కువనే చెప్పాలి. హైదరాబాద్ లో స్పెషల్ సెట్ వేసి వెంకీ సన్నివేశాలను చిత్రీకరించారు. పీవీపీ సినిమాస్ 'ఓరి దేవుడా'ను నిర్మించింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ మొత్తం రికవరీ చేసేశారు.
థియేటర్ లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. సినిమాలో వెంకటేష్, విశ్వక్ సేన్, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రస్తుతం వెంకీ ముంబైలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి 'కిసి కా భాయ్ కిసి కా జాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. నిజానికి వెంకటేష్ కు, సల్మాన్ కు మంచి దోస్తీ ఉంది. అందుకే సల్మాన్ తన సినిమాలో నటించాలని కోరడంతో వెంకీ వెంటనే ఓకే చెప్పారట. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.
హిందీ రీమేక్ లో వెంకీ:
'ఎఫ్ 3' సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సందడి చేశారు. ఆ తర్వాత ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. వెంకీతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి తేజ వరకు చాలా మంది కథలు చెప్పారు. కానీ, ఏదీ ఓకే కాలేదు. వేరే సినిమాలతో ఆయన దర్శకులు బిజీ బిజీ అవుతున్నారు. హిందీలో హిట్ అయిన 'దే దే ప్యార్ దే' రీమేక్ రైట్స్ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. బహుశా... ఆ రీమేక్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్