Samantha Chaitanya Divorce: అల్లుడు నాగచైతన్య విడాకులపై మొదటి సారి స్పందించిన వెంకీమామ
నాగచైతన్య-సమంత విడాకుల విషయంపై మొదటిసారి స్పందించారు వెంకటేశ్. దీనికి సంబంధించి తన ఇన్ స్టా అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు
నాగ చైతన్య, సమంతల విడాకుల విషయం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. కొన్నాళ్లనుంచి చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమే అంటూ తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు చైతూ-సామ్. నాగార్జున కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా మీడియాను, అభిమానులను కోరారు. అయినప్పటికీ ఎవ్వరూ తగ్గేదేలే అంటూ వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణం ఎవరు, ఏంటి, ఎందుకు అనే చర్చలు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు అభిమానులు, సెలబ్రెటీల రియాక్షన్ల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడిపోతున్నామని ప్రకటించిన తర్వాత చై-సామ్ ఇప్పటి వరకూ ఏ వార్తపైనా రియాక్ట్ కాలేదు. అయితే నాగచైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ తొలిసారిగా స్పందించారు.
తన ఇన్టాగ్రామ్ లో ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే “నోరు తెరవడానికి ముందు మనస్సు తెరవండి” అని పోస్ట్ చేశారు. అంటే నోరు తెరిచి కామెంట్స్ చేసేముందు, ఏదో ఒకి మాట్లాడే బదులు మనసుతో ఆలోచించి వాళ్లని ప్రశాంతంగా వదిలేయండని అర్థం అన్నమాట. ఇది చూసిన దగ్గుపాటి, అక్కనేని అభిమానులంతా వెంకీ మామ ఒక్కమాటతో స్ట్రాంగ్ గా చెప్పారే అంటున్నారు.
అయికే గత కొన్ని రోజులుగా చై-సామ్ విడిపోతున్నారని వరుస కథనాలు వచ్చినా ఆరంభలో ఇద్దరూ స్పందించలేదు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇబ్బంది కలిగించాయని లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య అన్నాడు కానీ ఈ విషయంపై అప్పట్లో క్లారిటీ ఇవ్వలేదు. నాలుగు రోజుల క్రితం తాము విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటన రాకుండా ఉండి ఉంటే ఈ రోజు వారి వివాహ వార్షికోత్సవం జరుపుకునేవారు. ఎందుకంటే అక్టోబరు 6 వారి పెళ్లిరోజు. ఈ సమయంలో గతేడాది మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామ్..చైతూని ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. `నువ్వు నా వాడివి.. నేను నీదానిని` మేము ఏ ద్వారం గుండా వచ్చినా దానిని కలిసే తెరుస్తాం` అంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది సమంత. గతేడాది కరోనా తగ్గుముఖం పట్టాక నవంబర్ లో చై పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లొచ్చారు. అదే వీళ్లిద్దరి చివరి వెకేషన్. ఏదేమైనా చై-సామ్ విడాకులకు అసలు కారణం ఏంటి? ఏం జరిగింది? వీరి వివాదం విడాకుల వరకూ ఎందుకెళ్లింది అనే ది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రీసెంట్ గా చైతూ నటించిన 'లవ్ స్టోరీ' థియేటర్లలో సందడి చేస్తుండగా.. సమంత నటించి 'శాకుంతలం' విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: ఇయ్యాల్టి నుంచే పూలపండుగ... బతుకమ్మ ఎలా ప్రారంభమైందో, ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో మీకు తెలుసా..
Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Also Read:ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం..మెగాస్టార్ ట్వీట్ వైరల్
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి