By: ABP Desam | Updated at : 10 Jan 2023 10:46 AM (IST)
'అన్‌స్టాపబుల్ 2'లో వరలక్ష్మీ శరత్ కుమార్, బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా. సిల్వర్ స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద... బాలయ్య సందడి చేయనున్నారు. సినిమాతో థియేటర్లలో, టాక్ షోతో ఓటీటీలో 'వీర సింహా రెడ్డి' వీర విహారానికి రెడీ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే...
'అన్‌స్టాపబుల్ 2'లో 'వీర సింహా రెడ్డి' టీమ్
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సూపర్ డూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'. ఆల్రెడీ సెకండ్ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ టాక్ షోకి బాలకృష్ణ తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' టీమ్ వచ్చింది. హీరోయిన్లు హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సందడి చేశారు. సోమవారం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ స్టూడియోలో ఈ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
జనవరి 13న 'వీర సింహా రెడ్డి' ఎపిసోడ్
'వీర సింహా రెడ్డి' సినిమా జనవరి 12న (అనగా... ఈ గురువారం) థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలైన తర్వాత రోజు 'అన్‌స్టాపబుల్ 2'లో సినిమా యూనిట్ సందడి చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అంటే... జనవరి 13న విడుదల అన్నమాట. నిజం చెప్పాలంటే... గురువారం రాత్రి పన్నెండు గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
''వీర సింహా రెడ్డి' టీమ్ 'అన్‌స్టాపబుల్ 2'లో అడుగు పెడితే... వీర లెవల్ మాస్ పండగ లోడింగ్. ఫిక్స్ అయిపోండి. సంక్రాంతి పండగకి రీసౌండ్ రావాల్సిందే'' అని 'ఆహా' వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
బాలకృష్ణకు గోపీచంద్ మలినేని వీరాభిమాని. బాలయ్య సినిమాలకు వెళ్ళి పోలీసు లాఠీ దెబ్బలు తినడం, జైలుకు వెళ్ళి రావడం వంటివి జరిగాయి. ఆయన 'క్రాక్'తో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్ కెరీర్ కొత్త రూట్ తీసుకుంది. ఆమె కూడా షోకి వచ్చారు. ఆ సంగతులు డిస్కషన్‌కు రావచ్చు. తొలుత 'అన్‌స్టాపబుల్ 2'లో శ్రుతీ హాసన్ కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు చూస్తే... ఆవిడ లేరు. జ్వరం రావడంతో షూటింగులో పాల్గొనడం కుదరలేదని సమాచారం.
Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి
రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి ఎపిసోడ్
'అన్‌స్టాపబుల్ 2'కు బాహుబలి ప్రభాస్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ రెండు పార్టులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇయర్ ఎండ్ ధమాకాగా తొలి పార్ట్ విడుదలైన సమయంలో ఒకేసారి ఎక్కువ మంది అభిమానులు యాప్ ఓపెన్ చేయడంతో కాసేపు 'ఆహా' పని చేయలేదు. అందుకు సారీ చెప్పారనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే... 'అన్‌స్టాపబుల్ 2'లో బాహుబలితో బాలకృష్ణ సందడి చూడటానికి జనాలు విపరీతమైన ఆసక్తి చూపించారు. దాంతో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు?
'అన్‌స్టాపబుల్ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. అయితే, ఆయన ఎపిసోడ్ ఎప్పుడు విడుదల చేశారు? అని మెగా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తొలుత సంక్రాంతికి విడుదల అవుతుందని భావించినా... ప్రస్తుత పరిస్థితి చూస్తే మరి కొన్ని వారాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. పవన్ ఎపిసోడ్ ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
Thandel Movie: అట్టహాసంగా ‘తండేల్’ మూవీ లాంఛ్, ఏడాదిన్నరగా కష్టపడుతున్నామన్న నాగ చైతన్య
Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!
Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!
Bobby Deol: అమ్మ క్లైమాక్స్ చూడలేదు, ఆ సీన్ చూడలేనని ఏడ్చేసింది - ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Tanushree Dutta: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
Look Back 2023: బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు - 2023లో బ్లాక్‌బస్టర్స్
ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ
/body>