By: ABP Desam | Updated at : 23 Jan 2023 02:49 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@NimmaShivanna/twitter
బ్లాక్ బస్టర్ ‘వేద’ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన తాజా సినిమా ‘వేద’ తెలుగులో విడుదకాబోతోంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం.
హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రంగా తెరకెక్కిన ‘వేద’
.@NimmaShivanna 's 125th Film Action - Drama Titled as #Vedha - The Brutal 1960's 💥
🌟ing :#ShivaRajkumar #GhanaviLaxman
🎬 : #HarshaA
💰:#KanchiKamakshiKolkataKaliKreations's Under #GeetaShivaRajkumar
🎥 : #SwamyJGowda
✂️ : #DeepuSKumar
🎼 : #ArjunJanya
📣 : @vrmadhu9 pic.twitter.com/OEOC4rNPk3 — BA Raju's Team (@baraju_SuperHit) January 23, 2023
ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో గతేడాది డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఐకానిక్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన 125వ చిత్రంగా తెరకెక్కింది. శివరాజ్ కుమార్ భార్య గీత నేతృత్వంలో గీతా పిక్చర్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందింది. ఇప్పుడీ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 1960 నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా కన్నడలో బ్లాక్ బస్టర్ సాధించినట్లుగానే, తెలుగులోనూ చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.
స్వామి జె గౌడ్ సినిమాటోగ్రఫీ, అర్జున్ జన్య సంగీతం
ఈ సినిమాకు సంబంధించిన సాంకేతి బృందం విషయానికి వస్తే, స్వామి జె గౌడ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటర్ గా దీపు ఎస్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంగీతం అర్జున్ జన్య అందిస్తున్నారు. పిఆర్ఓ గా విఆర్ మధు ఉన్నారు. ప్రసాద్ లింగం డిజిటల్ మీడియా చూస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ సోదరుడే హీరో శివ రాజ్ కుమార్
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు హీరో శివ రాజ్ కుమార్. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుల్లో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న హఠాన్మరణం చెందారు. జిమ్ చేస్తున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె పోటు వచ్చింది. ఆయన్ని వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయారు. కన్నడ సినీ పరిశ్రమలో ఆయనను పవర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్‌కుమార్. పునీత్ చనిపోయినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ సహా పలువురు నటులు బెంగుళూరుకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
The explosive #VedhaTrailer OUT NOW! 🔥https://t.co/aVXSyQrCR8#Vedha coming to a #PVR near you on 23rd Dec.@ZeeMusicSouth#ವೇದ @NimmaShivanna @NimmaAHarsha @ZeeStudios_ @GeethaPictures @zeestudiossouth@ArjunJanyaMusic @iammangli @VedhaMovie @SagarAdithi #VedhaOnDec23 pic.twitter.com/hoW0vrqtQJ
— P V R C i n e m a s (@_PVRCinemas) December 14, 2022
Read Also: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టబోతున్న మురుగదాస్, శివ కార్తికేయన్ హీరోగా సినిమా!
VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన