Yami Gautam : మగబిడ్డకి జన్మనిచ్చిన యామి గౌతమ్.. బాబు పేరుకు అర్థం ఇదే
Yami Gautam : నటి యామి గౌతమ్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు ఆమె. ఇక ఆ బాబుకి పేరు కూడా పెట్టారు. మరి ఆ పేరేంటి? అర్థం ఏంటంటే?
Yami Gautam, Aditya Dhar Blessed With Baby Boy : నటి యామి గౌతమ్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఆమె. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు యామిని. ఆమె భర్త, డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ బాబుకి వేదవిద్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. అక్షయ తృతియ రోజు బాబు పుట్టాడని, ఆ సంతోషాన్ని మీతో పంచుకునేందుకు ఈరోజు రివీల్ చేస్తున్నామని రాసుకొచ్చారు.
ప్రత్యేకమైన ఫోటోతో..
శివుని చేతిలో చిన్న బిడ్డ ఉన్నట్లుగా ఒక ప్రత్యేకమైన ఫోటో షేర్ చేసింది ఈ జంట. ఆ ఫోటో ద్వారా గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. "ఒక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. మా బాబు గొప్ప భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నాం. మా కొడుకు ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాం. మా కుటుంబానికి, దేశానికి గర్వకారణం అయ్యేలా ఎదగాలని కోరుకుంటున్నాం" అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వాళ్లు తమ డాక్టర్లకు కూడా థ్యాంక్స్ చెప్పారు.
View this post on Instagram
పేరు ఏంటంటే?
ఈ సందర్భంగా వాళ్లు పేరు కూడా అనౌన్స్ చేశారు. శివుని చేతిలో బాబు ఉన్న ఫొటోను షేర్ చేసి "అక్షయ తృతియ రోజు పుట్టిన మా బాబు పేరు 'వేదవిద్' అని చెప్పేందుకు సంతోషంగా ఉంది. ఒక మంచి రోజున మా ఇంట్లో అడుగుపెట్టాడు" అంటూ చెప్పుకొచ్చారు యామి గౌతమ్. మీరందరూ బ్లెస్సింగ్ ఇవ్వాలి అంటూ పోస్ట్ పెట్టారు యామి గౌతమ్.
వేదవిద్ కి అర్థం ఏంటంటే?
యామి గౌతమ్, ఆదిత్య దంపతులకు ఈ నెల 10న అంటే.. అక్షయ తృతియ రోజున బాబు పుట్టాడు. దీంతో స్పెషల్ డే రోజు పుట్టిన చిన్నారికి స్పెషల్ గా పేరు పెట్టారు ఆ దంపతులు. దీంతో ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసుకునేందుకు అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే, ఆ పేరుకు చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. వేదవిద్ అంటే "వేదాలు తెలిసిన వాడు" అని అర్థం. అంతే కాకుండా విష్ణు మూర్తి, శివుడు, రాముడి అంశ అని కూడా. ఇక ఆ పేరును రెండుగా విడదీస్తే.. 'వేద' అనేది సంస్కృత పదం. హిందు ఇజం లో దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక 'విద్' అంటే.. 'జ్ఞానం' కలిగిన వాడు అని అర్థం. అందుకే ఈ పేరును వేద్ విద్ అని పలకాలి.
శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రిటీలు..
యామి గౌతమ్ ఆ పోస్ట్ పెట్టిన వెంటనే ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు చాలామంది సెలబ్రిటీలు. అయుష్మాన్ ఖరానా, మృణాల్ ఠాకూర్, నెహా దుపియా, ప్రియమణి, రణ్ వీర్ సింగ్ తదితరులు విషెస్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ అయితే, తెగ కామెంట్లు పెడుతున్నారు. పేరు వెరైటీగా ఉందని, బాగుందంటూ పోస్ట్ చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే నటి యామి గౌతమ్.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. 'నువ్విలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆమె. ఆ తర్వాత 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కల్యాణ్' తదితర సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ సాధించారు ఆమె. ఇక 'ఆర్టికల్ 370' లో నటించిన యామిని.. ఆ సినిమా ప్రమోషన్స్ లో తను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు.
Also Read: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల