అన్వేషించండి

Dil Raju on Ajith vs Vijay: అందుకే విజయ్‌ను నెంబర్ వన్ హీరో అనేది - క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు

తమిళంలో విజయ్‌నే నెంబర్ వన్ హీరో అన్న దిల్ రాజు వ్యాఖ్యాలపై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. దీనిపై ఆయన స్పందించాడు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అజిత్, విజయ్ అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదొక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోల సినిమాలకూ ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది. ఇక వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే ఆ పోటీ ఎలా ఉంటుంతో చెప్పక్కర్లేదు. దీంతో అభిమానులు కూడా మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటూ.. సోషల్ మీడియాలో చర్చలకు దిగుతారు. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హీరో విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారమే రేపాయి. తమిళంలో విజయ్ నే నెంబర్ వన్ హీరో అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇది దాదాపు కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే ఇన్ని రోజులూ దిల్ రాజు తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. దీంతో ఇది కాస్తా వివాదంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తమిళ హీరోల గురించి తాను చేసిన కామెంట్లపై స్పందించారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

నిర్మాత దిల్ రాజు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘వారిసు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గతంలో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తమిళంలో అజిత్ కంటే విజయ్ నే ఎక్కువ అనే మాటను వాడాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలు అజిత్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో దిల్ రాజు టార్గెట్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దిల్ రాజు ఎప్పుడూ ఇంతే ఏ సినిమా తీస్తే ఆ హీరో ను పొగుడుతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో విజయ్ నే నెంబర్ వన్ హీరో ఎందుకు అనే దానిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో తాను ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నానని, ఓ తమిళ హీరోను తెలుగు దర్శకుడితో కలిపానని, తమిళ డైరెక్టర్‌ తో తెలుగు హీరోను కలిపానని అన్నారు. ఇది కొత్త ట్రెండ్ అన్న ఆయన తన వద్ద కథ రెడీగా ఉంటే ఏ స్టార్ హీరోను అయినా కలుస్తాను అని తెలిపారు. స్టార్ హీరో అంటే అది ఆ హీరో కు ఉండే క్రేజ్ అని అన్నారు. గత ఐదారు సంవత్సరాల్లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు రూ.60 కోట్లకు పైగానే వసూళ్లు సాధించాయని అన్నారు. అందుకే విజయ్ నెంబర్ వన్ అని అన్నాను అని చెప్పుకొచ్చారు. ఇక తన మిగతా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. శంకర్, రామ్ చరణ్ RC15 దాదాపు 60 షూటింగ్ పూర్తయిందని అన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీను విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు చేయబోతోన్నట్టుగా తెలిపారు.

Also Read : 'గ్యాంగ్ లీడర్'లో ఎస్పీగా నటించిన వల్లభనేని జనార్ధన్ మృతి - ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Embed widget