Upasana Ram Charan: ఎంతటి స్టారైనా భర్తగా బ్యాగులు మోయాల్సిందే - చరణ్, ఉపాసన షాపింగ్ ఫొటోలు వైరల్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వీధుల్లో రామ్ చరణ్-ఉపాసన చక్కర్లు కొడుతున్నారు. తమకు కావాల్సిన థింగ్స్ కోసం ఇద్దరూ కలసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటింది ‘ఆర్ఆర్ఆర్’. అటు అంతర్జాతీయంగా అవార్డులను అందుకోడమే కాకుండా ఆస్కార్ అవార్డుల బరిలో కూడా ఈ సినిమా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ టీమ్ మొత్తం అమెరికా పర్యటనలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ భార్య ఉపాసన కూడా అమెరికా పర్యటనలో భాగమైంది. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన కలసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వీధుల్లో రామ్ చరణ్-ఉపాసన చక్కర్లు కొడుతున్నారు. తమకు కావాల్సిన థింగ్స్ కోసం ఇద్దరూ కలసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ కలసి బోటింగ్, షాపింగ్ చేస్తున్న ఫోటో వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో చెర్రీ-ఉపాసన చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ షాపింగ్ చేసిన బ్యాగులను పట్టుకోగా, ఆయన ముందు ఉపాసన స్టైల్ గా నడుస్తోన్న ఫోటోలపై నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య షాపింగ్ బ్యాగుల్ని మోయాల్సిందే అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇటీవలే ఉపాసన తన భర్త రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో చరణ్ తనకు మద్దతుగా నిలస్తున్నాడని చెప్పారు. అలాగే తాను కూడా చెర్రీ విషయంలో సపోర్ట్ గా ఉంటానని చెప్పారు. ‘‘ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట షూటింగ్ కోసం చరణ్ ఉక్రెయిన్ వెళ్లినపుడు, ఇంట్లో ఉన్నపుడు, షూటింగ్ లలో బిజీగా ఉన్నపుడు.. ఇలా ప్రతి విషయంలోనూ చెర్రీ వెన్నంటే ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు ‘‘చరణ్ కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వర్క్ పరంగా కూడా ఆయన ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ సంవత్సరం ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అందుకే ఈ ఏడాది ఆయనదే’’ అంటూ వివరించారు ఉపాసన.
Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?
ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘జవాన్’ సినిమాలో రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం మూవీ మేకర్స్ మందు విజయ్ సేతుపతి, తర్వాత అల్లు అర్జున్ ను సంప్రదించారు. అయితే వారు వివిధ కారణాల వలన నో చెప్పడంతో తర్వాత రామ్ చరణ్ ను సంప్రదించారు. దీనికి ఆయన ఓకే చెప్పారట. అయితే షారుఖ్ కోసమే చెర్రీ ఈ సినిమాను ఒప్పుకున్నారని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అనంతరం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ సి 15’ షూటింగ్ లో పాల్గొననున్నారు.
Amidst all the hustle, Mr.C’s time out for “ us “👼🏻❤️
— Upasana Konidela (@upasanakonidela) March 7, 2023
Sneak Peek #babymoon
Happy Holi ❤️
Thank you for taking me 🐋 & 🐬 watching 💙
Ticking it off my bucket list.@AlwaysRamCharan pic.twitter.com/5WZR1RUP2c