Upasana: 'చెర్రీ, గుర్తుపెట్టుకుంటా' రామ్ చరణ్‌కు ఉపాసన స్వీట్ వార్నింగ్, కారణం ఇదే!
రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ.. 'ఇంట్లో ఎవరికి ఎక్కువ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ప్రశ్నించారు సుమ.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో భాగంగా.. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ.
రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ.. 'ఇంట్లో ఎవరికి ఎక్కువ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాసేపు ఆలోచించి 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే' అని బదులిచ్చారు.
ఈ సమాధానం విన్న చిరంజీవి.. 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఉపాసన 'హుమ్.. మిస్టర్ సి, గుర్తుపెట్టుకుంటా' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఉపాసన కూడా హాజరైంది. కానీ స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు.
Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?
Also Read: 'ఆచార్య' టీమ్ వారిద్దరినీ కావాలనే మర్చిపోయిందా?
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















