Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
Unstoppable 2 Aha Server : ఈ రోజు రాత్రి ఏం జరగబోతుంది? 'ఆహా'లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యాప్ ఈసారి క్రాష్ అవుతుందా? లేదా? అని!
ఇప్పుడు ఏం జరుగుతుంది? రాత్రికి ఏం జరగబోతుంది? లక్షలాది మంది ఒకేసారి 'ఆహా' యాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? తెలుగు ప్రేక్షకుల మదిలో ఉన్న ప్రశ్నలు ఇవి. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అతిథిగా వచ్చిన 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్ ఎపిసోడ్ (Unstoppable 2 Latest Episode) ఫస్ట్ పార్ట్ఈ రోజు (ఫిబ్రవరి 2, గురువారం) రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్లలో విడుదల అయ్యే సినిమాల కంటే ఈ ఎపిసోడ్ మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది.
ప్రభాస్ వచ్చినప్పుడు...
ఏమైందో చూశారుగా!
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్‌ను గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇంటర్వ్యూ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ విడుదల అయినప్పుడు ఆహా యాప్ క్రాష్ అయ్యింది. ఎక్కువ మంది ఒకేసారి యాప్ ఓపెన్ చేయడంతో పని చేయలేదు. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒకేసారి ఆహా మీద పడితే... ఏం జరుగుతుంది? అనేది క్వశ్చన్.
ముందు జాగ్రత్త పడిన ఆహా!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా వర్గాలకూ ఆ విషయం తెలుసు. అందుకని, ముందు జాగ్రత్త పడ్డారు.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ విడుదల సందర్భంగా ఈ రోజు రాత్రి సుమారు 20 లక్షల మంది యాప్ ఓపెన్ చేయవచ్చని ఆహా అంచనా వేసింది. ఆ తాకిడిని తట్టుకుని యాప్ క్రాష్ అవ్వకుండా నిలబడటం కోసం బ్యాకప్ సర్వర్లను ఎరేంజ్ చేశారు. సో... ఈ రోజు యాప్ క్రాష్ కాకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోలా సోషల్ మీడియాలో డిస్కషన్!
ఇప్పుడు 'ఆహా' క్రాష్ అవుతుందా? లేదా? అనే డిస్కషన్ సోషల్ మీడియాకు కూడా ఎక్కింది. ఒక విధంగా అభిమానుల మధ్య కాస్త పోటీ వాతావరణానికి కారణం అయ్యింది. ఫ్యాన్ ఫాలోయింగ్‌కు యాప్ క్రాష్ కావడం అనేది ఒక కొలమానంగా కొందరు చూస్తున్నారు. ఈ రోజు ఆహా క్రాష్ అయితే ప్రభాస్ కంటే పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని, లేదంటే కాదని కొందరు ట్వీట్లు, పోస్టులు చేయడం గమనార్హం.
కాచుకుని కూర్చున్న పైరసీ రాయుళ్లు!
ఒక వైపు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూడటం కోసమే కొందరు ఆహా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటుంటే... మరోవైపు పైరసీ రాయుళ్లు కాచుకుని కూర్చున్నారు. ఆ ఎపిసోడ్ ఆహాలోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం... పైరసీ చేసి ఆన్‌లైన్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభాస్ ఎపిసోడ్ విషయంలోనూ ఆహాకు పైరసీ పెద్ద దెబ్బ వేసింది. అప్పట్లో ఎపిసోడ్ విడుదలకు ముందు పైరసీ రాయుళ్లుపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఆహా కోర్టు మెట్లు ఎక్కింది. మరో సారి పైరసీ రాయుళ్లకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, పెళ్లిళ్లు... పవన్ కళ్యాణ్ ఏం చెప్పి ఉంటారనే ఆసక్తి అందరిలో ఎక్కువగా ఉంది.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?