Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!
సౌత్ లో టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది వరుస ఫ్లాప్స్ మూటగట్టుకుంది. ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అటు కృతి సనన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
2022 బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి సత్తా చాటింది. ఇప్పటికీ ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. కానీ, గత కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ టైమ్ అస్సలు బాగా లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుస బెట్టి ఫ్లాప్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఆమె నటించిన ‘రన్‌వే 32’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక.. ఫ్లాప్ అయ్యింది. ఆమె నటించిన ‘కట్ పుత్లీ’ సినిమా కూడా OTTలో విడుదలై, డిజాస్టర్‌గా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలి అనుకున్నా, చివరకు OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. చాలా అంచనాలతో ఈ మూవీ రిలీజ్ అయినా సినీ లవర్స్ ను తీవ్ర నిరాశపరిచింది. ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో నెగెటివ్ రివ్యూలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సినీ క్రిటిక్స్ నుంచి సాధారణ ఆడియెన్స్ వరకు అందరూ ఇదో చెత్తా సినిమా అంటూ కామెంట్ చేశారు. మొత్తంగా ఈ ఏడాది రకుల్ నటించిన 5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఇటీవల సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రకుల్ ప్రీత్ సింగ్ 2022 బిగ్గెస్ట్ ఫ్లాప్ నటిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె 2022లో బ్యాక్ టు బ్యాక్ 5 డిజాస్టర్స్ ఇచ్చింది. ఆమె కెరీర్ ప్రస్తుతానికి ముగిసింది” అని ట్వీట్ చేశారు.
రకుల్ ప్రీత్ డిజాస్టర్ మూవీస్ లిస్ట్ ఇదే!
1. రన్‌వే 34 (డిజాస్టర్)
2. కట్‌పుట్లీ (OTT డిజాస్టర్)
3. థ్యాంక్ గాడ్ (డిజాస్టర్)
4. డాక్టర్ జి (డిజాస్టర్)
5. అటాక్(డిజాస్టర్)
Biggest FLOP Actress of 2022 #RakulPreetSingh ! She gave Back to Back 5 Disasters in 2022 !!! Her Career is Over now 👍 ! #Runway34 ( Disaster ) #Cuttputli ( OTT Disaster ) #ThankGod ( Disaster ) #DoctorG ( Disaster )#Attack ( Disaster ) pic.twitter.com/rucbHn2FzA
— Umair Sandhu (@UmairSandu) November 30, 2022
కృతి సనన్ పరిస్థితీ ఇంతే!
రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాదు, మరో హీరోయిన్ కృతి సనన్ పరిస్థితి కూడా ఇంతే! ఆమె ఈ ఏడాది నటించిన సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలయ్యాయి. ఈమె గురించి కూడా ఉమైర్ సంధూ ఓ ట్వీట్ చేశారు. “కృతి సనన్ పూర్తిగా ఓవర్‌రేట్ చేయబడింది! 2022లో మరో ఫ్లాప్ హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ ఆమె చేసిన 3 డిజాస్టర్లుగా నిలిచాయి” అని రాసుకొచ్చారు.
కృతి సనన్ డిజాస్టర్ మూవీస్ లిస్ట్ ఇదే!
1. హమ్ దో హమారే దో (OTT డిజాస్టర్)
2. బచ్చన్ పాండే (డిజాస్టర్)
3. భేడియా (డిజాస్టర్)
#KritiSanon is totally Overrated! Another Flop Actress of 2022 ! Back to Back 3 Disasters by her ! #HumDoHamareDo ( OTT Disaster) #BachchhanPaandey ( Disaster) #Bhediya ( Disaster) pic.twitter.com/q3AAt6SYVd
— Umair Sandhu (@UmairSandu) November 30, 2022
Read Also: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?