By: ABP Desam | Updated at : 06 Jun 2023 06:38 PM (IST)
వరలక్ష్మి శరత్కుమార్, బిందు మాధవి(Photo Credit: Star Maa/Youtube)
బుల్లితెరపై ఓంకార్ హోస్ట్ చేస్తున్నన ‘సిక్స్త్ సెన్స్’ మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 సీజన్లు కంప్లీట్ చేసుకున 5వ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఈ షోలో సెలబ్రిటీలు చేసే ఫన్నీ టాస్క్ లు అందరినీ అలరిస్తుంటాయి. తాజాగా ఈ షోలో హీరోయిన్లు బిందు మాధవి, వరలక్ష్మి శరత్ కుమార్ పాల్గొన్నారు. వీరు చేసిన సందడి అందరినీ బాగా అలరించింది. వరలక్ష్మీ డైలాగ్ చెప్పి అదరగొట్టగా, బిందు మాధవి డ్యాన్స్ తో ఆకట్టుకుంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ షోలో పాల్గొన్న బిందు మాధవి, వరలక్ష్మి పెళ్లి గురించి హాట్ కామెంట్స్ చేశారు. మీకు ఇష్టం లేని ఒక టాపిక్ అని యాంకర్ ఓంకారు అంటారు. ఏంటి అని బిందు మాధవి అనడంతో పెళ్లి అంటాడు. వెంటనే అబ్బో అంటుంది బిందు మాధవి. పెళ్లి అనేది భూతం లాంటిదని అది, తన పక్కకు రాకూడదంటూ చేతి వేళ్లను క్రాస్ చేసి పెడుతుంది వరలక్ష్మి. పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అనుకుంటున్నారు? అని బిందు మాధవిని ప్రశ్నించగా. ప్రస్తుతానికి ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. సమయం వచ్చినప్పుడు, ఆ మనిషి వచ్చినప్పుడు చేసుకుంటాను అని చెప్పింది. 30 ఏళ్లు వచ్చేసరికి అమ్మాయిలకు పెళ్లి అనే మైల్ స్టోన్ ఉంటుందని, ఒకవేళ అది క్రాస్ చేస్తే ఇక పెళ్లి జరగదు అనే ఆలోచనలో కొంత మంది ఉంటారని చెప్పింది. టైం ఫ్రేమ్ లో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మన మీద ఉండకూడదన్నది. అలా ఉంటే రాంగ్ రిలేషన్స్ కి దారి తీస్తుందని చెప్పుకొచ్చింది.ఒకప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఏమీ సాధించనట్లే అనుకునేవారని, కానీ, ఇప్పుడు ఆ ఆలోచన మారిందని చెప్పింది.
ఇక వరలక్ష్మీ కూడా పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికంటే ముందు తొలుత తామేంటో తెలుసుకోవాలని, ఆ తర్వాతే ఎదుటి వ్యక్తి మనల్ని ఎలా చూసుకుంటాడు, మనం అతడిని ఎలా చూసుకుంటాం అనేది తెలుస్తుందన్నారు. ఇక సినిమాల్లోకి రావడం, సక్సెస్ గురించి కూడా వరలక్ష్మీ కీలక విషయాలు చెప్పింది. “నేను ఏం సాధించినా క్రెడిట్ మొత్తం నాదే. ఇంక ఎవరూ లేరు. మా నాన్న శరత్ కుమార్ నేను హీరోయిన్ కావడాన్ని ఇష్టపడలేదు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. మా అమ్మకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. కాబట్టి, ఈ సక్సెస్ కు కారణం నేనే. ఒకప్పుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అనేవారు. ఇప్పుడు వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ అంటున్నారు” అని వెల్లడించింది. ఇక చివరల్లో బిందు మాధవి, వరలక్ష్మి కలిసి చివరిలో మాస్టారు మాస్టారు అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ ఎపిసోడ్ పూర్తి భాగం ఈ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
Read Also: అలా చేయడం ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదు, త్వరలో నేనే ఓ మూవీ తీస్తా: కరాటే కల్యాణి
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>