Nitin Chauhaan Death: సూసైడ్ చేసుకొని చనిపోయిన టీవీ సీరియల్ నటుడు నితిన్
Nitin Chauhaan Dies Suicide: 35 ఏళ్ల బుల్లితెర నటుడు కన్నుమూశాడు. అలీగఢ్ జిల్లా నుంచి వచ్చిన ఈ కుర్రాడు సీరియల్స్‌తో ఫేమస్ అయ్యాడు.
![Nitin Chauhaan Death: సూసైడ్ చేసుకొని చనిపోయిన టీవీ సీరియల్ నటుడు నితిన్ TV actor Nitin Chauhan famous for Crime Patrol and Splitsvilla passes away Nitin Chauhaan Death: సూసైడ్ చేసుకొని చనిపోయిన టీవీ సీరియల్ నటుడు నితిన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/08/153cb01c017b193d3405159ee7a92ce41731052056801215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TV Actor Nitin Chauhaan Dies: 'తేరా యార్ హూన్ మైన్' టీవీ షో ఫేమ్ నితిన్ చౌహాన్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. 35 ఏళ్ల వయసులో నితిన్ మృతి వార్త విన్న టీవీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండే నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి మరింత విషాదంలో మునిగిపోయారు.
నితిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు నితిన్ సన్నిహితుడు కుల్దీప్ చెప్పాడు. ఈ విషాద వార్తను నితిన్ తండ్రి, సోదరి తనకు చెప్పారని కుల్దీప్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. .
కుల్దీప్ ఏం చెప్పాడు?
కుల్దీప్ జాతీయ ఛానల్స్‌తో మాట్లాడుతూ, “ఈ రోజు (నవంబర్ 7) ఉదయం నితిన్ తండ్రి, సోదరి నాకు ఫోన్ చేసి నితిన్ మరణించారని చెప్పడంతో షాక్ అయ్యాం. ఆత్మహత్య చేసుకొని పోనిపోయినట్టు చెప్పారు. వచ్చే నెలలో ఢిల్లీకి రావాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరగడంతో మేమంతా షాక్‌లో ఉన్నాం. తను వస్తే ఫ్రెండ్స్ అంతా కలిసి ఖాతు శ్యామ్ జీ ఆలయానికి వెళ్లాలని అనుకున్నాం.
నితిన్ ఎలా ఉండే వాడు
“గత నెలలో నితిన్ రాజస్థాన్ వెళ్లాలని అనుకున్నాడు. నితిన్ ఒకటి రెండు నెలలకోసారి ఢిల్లీకి వస్తూ ఉంటాడు. ఆయనే మా ప్రాణం.. ఆయనతో మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మా టూర్‌లలో నితిన్ అన్ని సౌకర్యాలు కల్పించేవాడు. అని ఫ్రెండ్ కుల్దీప్ తెలిపారు.
నితిన్ ఎందుకు టెన్షన్ పడ్డాడో తెలియదు:కుల్దీప్
కుల్దీప్ మాట్లాడుతూ... “ఇది చేసే ముందు ఒకసారి నాకు కాల్ చేసి ఉంటే, మనతో ఉండేవాడు. ఇలాంటి వాటికి కారణాలపై ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు, మేము ప్రతిదీ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటాం. అతనికి ఆర్థిక సమస్యలు కూడా పెద్దగా లేవు. ముంబైకి రమ్మని ఎప్పుడూ చెప్పేవాడు, మేము కూడా ఒకసారి అక్కడికి వెళ్లామని అనుకున్నాం. మేనకోడలు పుట్టగానే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలే."
నితిన్ Zindagi.com, Crime Patrol and Friends సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా MTV నిర్వహించిన 'Splitsvilla Season 5' విజేతగా కూడా ఉన్నారు .
Also Read: నాగార్జున గారూ... ప్రమాదకరమైన వివాదం నడుస్తోంది పరిష్కరించండీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)