అన్వేషించండి

Trinayani Serial Today November 1st: 'త్రినయని' సీరియల్: త్రినేత్రిని పాము కాటేస్తుందా.. నయని గుర్తిస్తుందా.. పాపకి పట్టాభిషేకం!

Trinayani Today Episode త్రినేత్రికి పాము కాటేయనున్నట్లు నయనికి కనపించడం త్రినేత్రి అచ్చం తనలాగే ఉండటంతో నయని తనకే పాము కాటేస్తుందని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విక్రాంత్, వల్లభలన్ని తిలోత్తమ కొడుతుంది. విక్రాంత్‌తో కన్న తల్లినైన నా చావు కోరుకుంటావురా అని తిడుతుంది. గాయత్రీ అక్క పునర్జన్మలో పుట్టలేదు నాకు చావు లేదు అని ప్రశాంతంగా ఉందని అనుకునేలోపు ఆ రహస్యం చెప్పి నన్ను టెన్షన్ పెట్టావ్ అని తిలోత్తమ అంటుంది. దానికి విక్రాంత్ ఈ రోజు కాకపోయినా ఏదో రోజు తెలియాల్సిన నిజమే ఆ రోజు నువ్వు మిగలవు అమ్మ అని అంటాడు. ఇంతలో సుమన అక్కడికి వచ్చి ఏమైందని అడిగితే దోమలు వాలితే అమ్మ కొడుతుందని అంటాడు వల్లభ.

సుమన: నా సపోర్ట్ ఎప్పుడు అత్తయ్యకే ఉంటుంది.
తిలోత్తమ: చూడరా తోడపుట్టిన అక్కని కాదని నన్ను సపోర్ట్ చేస్తుంది.
 విక్రాంత్: తాను ఏం ఆశిస్తుందో.
సుమన: నేను ఏం ఆశించను
తిలోత్తమ: నువ్వు ఏం ఆశించినా ఆశించకపోయినా నీకు ఇవ్వాల్సింది ఇస్తా సుమన. 
వల్లభ: కొంచెం క్లారిటీ ఇవ్వు మమ్మీ బెంబేలెత్తిపోతుంది చిన్న మరదలు.
తిలోత్తమ: ఎప్పటిలాగే నువ్వు నా మాట వింటే అందరి ఎదురుగా తలెత్తుకునేలా చేస్తాను.
సుమన: ఆ పని చేస్తే నా ప్రాణం కావాలి అన్నా ఇచ్చేస్తా. అందరూ సుమన రిచ్ అనుకుంటే చాలు తర్వాత నేను పోయినా పర్లేదు..
తిలోత్తమ: నువ్వు బాగు పడటం వాడికి ఇష్టం లేదు సుమన.
సుమన: నిజమే అత్తయ్య మీరే నా జీవితం మార్చేయాలి.

మరోవైపు త్రినేత్రి మేనత్త, మామలు త్రినేత్రిని ఎలా చంపాలా అని ప్లాన్ చేసుకుంటుంటారు. పాముల వాడికి చెప్పి పాములతో కాటేయిద్దామని అనుకుంటారు. ఇక హాసిని గాయత్రీ పాపని పట్టుకొని ఆటాడిస్తుంది. గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని అనుకోలేదని ఇప్పుడు ఈ పాప నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటుందని హాసిని పావనా మాట్లాడుకుంటారు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. తిలోత్తమ చావు గురించి మాట్లాడుకుంటున్నామ్ అంటే మీరు ఇందుకు ఇలా మాట్లాడుకుంటారని అంటుంది తిలోత్తమ. 

వల్లభ: పెద్దమ్మే ఈ పాప అని తెలియనప్పుడే ఆస్తిలో వాటా రాసిచ్చేసారు కదా మమ్మీ.
సుమన: నిజమే బావగారు తోడబుట్టిన దానికన్నా పుట్టు పూర్వొత్తరాలు తెలియని దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.
హాసిని: చిట్టీ నువ్వు తోడబుట్టిన దానివి అయితే గాయత్రీ పేగు తెంచుకొని పుట్టింది.. ఈ పాపే తన పెద్ద కూతురు అని తెలియకపోయినా కన్నతల్లిదండ్రుల చేయి పట్టుకొని గాయత్రీ దేవి పేరు పెట్టుకొని ఇంటికి వచ్చింది గాయత్రీ దేవి పాప.
నయని: ఏది ఏమైనా అంతా మంచే జరిగింది.

విక్రాంత్ గాయత్రీ పాపకి పట్టాభిషేకం చేద్దామని అంటాడు. సుమన, వల్లభలు వద్దన్నట్లు మాట్లాడుతారు. విశాల్ కూడా వద్దని అంటాడు. దానికి విక్రాంత్ గాయత్రీ పాపే పెద్దమ్మ అని తెలియాలి అంటే ఆ మాత్రం సందడి చేయాలి అని అంటాడు. పావనా కూడా పబ్లిసిటీ కోసం ఫంక్షన్ చేద్దామని అంటాడు. కనీసం చిన్న అనౌస్స్ మెంట్ అయినా చేద్దామని విక్రాంత్ అంటాడు. ఇక నయనికి భవిష్యత్ కనిపిస్తుంది. పాము త్రినేత్రికి కాటేయడానికి వచ్చినట్లు చూస్తుంది. దాంతో త్రినేత్రి ఉందని తెలియని నయని తనకు తానే కనిపించానని షాక్ అయిపోతుంది. వల్లభ నయనిని చూసి ఏమైంది పెద్ద మరదలు అక్కడే ఆగిపోయిందని అంటాడు. నయని తనకే పాము కాటేయనుందని అనుకొని అది ఇంట్లో వాళ్లకి చెప్పాలా వద్దా అని అనుకుంటుంది.

నయని మాట్లాడకుండా అలా ఉండిపోయిందేంటి అని అనుకుంటారు. ఇంతలో నయని ఏం మాట్లాడకుండా పైకి వెళ్లిపోతుంది. నయని అలా వెళ్లిపోయింది ఏంటని అనుకుంటారు. ఇక విక్రాంత్ ల్యాప్ టాప్ సుమన తీసుకుంటుంది. విక్రాంత్ తనని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ నా కూతురిని పట్టించుకోకపోతే ఊరుకోను అని అంటుంది. దానికి విక్రాంత్ నా జీతంతో బాగానే చూస్తున్నాను అంటాడు. నయనికి ముగ్గురు ఆడపిల్లలే అని వారసుడు అంటే నీ కొడుకు పుండరీనాథమే కదా ఆయనకు పట్టాభిషేకం చేయమని చెప్పమని సుమన హాసినిని అంటే గాయత్రీ దేవికే పట్టాభిషేకం అవ్వాలని హాసిని అంటుంది. ఇక నయని గాయత్రీ దేవి ఫొటో దగ్గర నిల్చొని నాకు ఏమైనా అయితే మిమల్ని తిలోత్తమ అత్తయ్య ఏమైనా చేస్తుందని భయం వెంటాడుతుందని కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: Jai Hanuman First Look: 'హనుమాన్' సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్... దీపావళికి 'జై హనుమాన్' ఫస్ట్ లుక్

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget