
Trinayani Serial Today November 19th: 'త్రినయని' సీరియల్: పాపని తాకగానే నయనిలా మారిపోయిన త్రినేత్రి.. విక్రాంత్‌లో కొత్త అనుమానాలు.. చనిపోయిన డాక్టర్!
Trinayani Today Episode త్రినేత్రి అప్పటి వరకు ఎవరూ తెలీనట్లు మాట్లాడి పాప తాకగానే నయనిగా మారిపోయి అందరితో మామూలుగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి అక్క కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది.. ఏం మందులు ఇచ్చారు ఇలా పిచ్చిదానిలా ఇంటికి వచ్చిందని డాక్టర్‌ని నిలదీయాలి అని అంటుంది. దానికి విక్రాంత్ నలభై లక్షలు ఖర్చు అయ్యాయని చెప్తే సుమన నోరెళ్ల బెడుతుంది.
సుమన: రిపోర్టులు మారినట్లు మా తాతయ్య పెట్టిన త్రినయని పేరు కాకుండా త్రినేత్రి అని చెప్తుంది చూశారా.
విక్రాంత్: అదే ఆలోచిస్తున్నా ఎందుకు అలా చెప్తుందా అని.. డాక్టర్‌ని ఒక మాట అడుగుదామని అంటే డాక్టర్ లేరు ఫోన్ కలవడం లేదు.
సుమన: వచ్చింది మా అక్క కాదు బుల్లిబావగారు. కాస్త ఆలోచించండి సడెన్‌గా ప్రమాదం జరుగుతుంది కానీ సడెన్‌గా గాయాలు నయనం అవుతాయా అలా ఆలోచించండి నాకు ఎందుకో మా అక్క చనిపోయి తన ఆత్మ వచ్చిందని అనిపిస్తుంది. షాక్ అయ్యారా.
విక్రాంత్: చెప్పు ఎక్కడుందా అని.. వదిన ప్రాణం పోదు పోరాదు. కానీ రెండు రోజుల్లో అలా ఎలా నయనం అవుతుంది.
హాసిని త్రినేత్రికి చీర కట్టి తీసుకొస్తుంది. పావనా మూర్తి అందరిని హాల్‌లోకి పిలుస్తాడు. త్రినేత్రిని చూపించి లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అంటుంది. బాబాయ్ గారు భలే సరదాగా మాట్లాడుతున్నారని త్రినేత్రి అంటే దానికి పావనా నయని తనని గుర్తు పట్టిందని అంటాడు. మీకు అంతా నయం అయిందా వదినా అని విక్రాంత్ అంటే దానికి త్రినేత్రి నన్ను అప్పుడే వదినా అనేస్తున్నారేంటి చిన్నబాబుగారు అని త్రినేత్రి అంటుంది. ఇంకెప్పుడు అనాలి మా ఆయన నిన్ను వదినా అని అని సుమన అడిగితే త్రినేత్రి సిగ్గేస్తుందని ముఖం మూసుకుంటుంది.
త్రినేత్రి: నన్ను విశాల్ బాబు గారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల తమ్ముడు గారు వదినా అంటే బాగుంటుంది కదా. అందరూ నోరెళ్లెబెడతారు.
పావనా: వామ్మో నయనమ్మ ఏంటి విశాల్ బాబుని మళ్లీ పెళ్లి చేసుకుంటావా.
త్రినేత్రి: అంటే పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయాలి కదా.
వల్లభ: ఏంటి మమ్మీ పెద్ద మరదలు ఇలా మాట్లాడుతుంది.
త్రినేత్రి: మీరు పెళ్లి అవ్వకుండానే వరసలు కలిపేస్తారా.
తిలోత్తమ: ఒక్క నిమిషం నేను ఎవరో గుర్తుందా
త్రినేత్రి: ఎందుకు గుర్తు పెట్టుకోవాలి.
సుమన: ఆవిడను నువ్వేమని పిలుస్తావ్.
త్రినేత్రి: బాబుగారితో నా పెళ్లి అయితే ఆ తర్వాత అత్తయ్య గారు అని పిలుస్తా.
పావనా: ఇది పరిస్థితి నయనమ్మ కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయింది అనుకుంటా.
విక్రాంత్: మనసులో నాకు ఎందుకో తిను వదినా కాదు అనిపిస్తుంది. బ్రోతో చెప్తే బాధ పడతాడు. ఇంట్లోవాళ్లతో చెప్తే వదిన స్థానంలో వచ్చిన ఈమెను ఇబ్బంది పెడతారు.
త్రినేత్రి: అవును అడగటం మర్చిపోయా ఈ పాప ఎవరు.
వల్లభ: నీ కూతురు.
త్రినేత్రి: ఇదిగోండి మర్యాదగా మాట్లాడితే మంచింది. నాకు ఇంకే పెళ్లి కాలేదు పిల్లల్ని అంటగడతారేంటి.
తిలోత్తమ: గాయత్రీ నీ కూతురు కాదా అంటావా అయితే
విశాల్: నయని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.
తిలోత్తమ: నువ్వు అన్నట్లే నయనివి కాదు నువ్వు ఎవరో చెప్పు త్రినేత్రి. తొలిబిడ్డ గాయత్రీనే గుర్తు పట్టడం లేదు అంటే తిను అయితే నయని కాదు. చెప్పు ఎవరు నువ్వు.
వల్లభ: నువ్వు మా తమ్మి విశాల్ భార్య నయనివి కాదు.
తిలోత్తమ వాళ్లు త్రినేత్రిని ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని నిలదీస్తారు. ఇక గాయత్రీ పాప త్రినేత్రిని చూసి రెండు చేతులు ఇస్తుంది. దాంతో హాసిని పాపని ఎత్తుకోమని త్రినేత్రికి ఇస్తుంది. త్రినేత్రిని పాపని ఎత్తుకుంటుంది. పాప చేయి త్రినేత్రికి తాకగానే త్రినేత్రికి తాను త్రినయని అని గుర్తొస్తుంది. దాంతో గాయత్రీ త్రినేత్రిలో ఉన్న నయని ఆత్మ నయనిలా ప్రవర్తిస్తుంది. కూతురిని ఎత్తుకొని ముద్దాడుతుంది. అందరితో నయనిలా మాట్లాడుతుంది. నువ్వు నువ్వేనా చెల్లి అని హాసిని అంటే అదేంటి అక్క అలా అంటావ్ అని నయని అంటుంది. ఇక వల్లభ నువ్వు నయని కాదు కిలాడీ అంటే నయని విరుచుకుపడుతుంది.
ఇప్పటి వరకు త్రినేత్రిలా ప్రవర్తించావని అందరూ చెప్తారు. దాంతో త్రినయని ఆలోచించగానే తనకు యముడి వరం లాంటి శాపం గుర్తొస్తుంది. నువ్వు నయని కాదు అని తిలోత్తమ అంటే నయని మా అత్తయ్య మామయ్య అని వాళ్ల పేర్లు తిలోత్తమ మొదటి భర్త పేరు చెప్తుంది. తిలోత్తమ బయటకు వెళ్లి త్రినయని గురించి ఆలోచిస్తుంటారు. నయని కావాలనే మనకు పిచ్చి పట్టేలా చేస్తుందా అని తిలోత్తమ అంటుంది. ఇక విక్రాంత్ నర్స్‌ని కలుస్తాడు. డాక్టర్‌ని కలుస్తానని అడుగుతాడు. దాంతో సారిక చనిపోయిందని నర్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తే క్రిష్ తండ్రి అని తెలుసుకున్న సత్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైత్రి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
