అన్వేషించండి

Trinayani Serial Today March 2nd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని బుట్టలో సర్దేసిన సుమన.. అడ్డంగా బుక్కైపోయి కంగుతిన్న తిలోత్తమ, వల్లభలు!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపను అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లేందుకు తిలోత్తమకు సుమన సాయం చేసి పాపను బాస్కెట్‌లో పెట్టి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode సుమన గాయత్రీ పాపని ఎత్తుకొని వచ్చి తిలోత్తమ, వల్లభలకు ఇస్తానని చెప్తుంది. మరోవైపు విశాల్‌, విక్రాంత్‌లు ఫైల్‌లు ముందు వేసుకొని ఆఫీస్‌ పనులు చూస్తారు. ఇక నయని కూడా అక్కడికి వస్తుంది. తిలోత్తమ, వల్లభలకు ఓ బాస్కెట్‌లో గాయత్రీ పాపని పెట్టి ఇస్తుంది సుమన. 

డమ్మక్క: ఎక్కడికి వెళ్తున్నారు.
తిలోత్తమ: బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అగడకూడదు అని తెలీదా..
నయని: వెళ్లిరండి అత్తయ్య కానీ ఆ బాస్కెట్ ఎక్కడికి పట్టుకెళ్తున్నారు. 
తిలోత్తమ: బ్యాంకుకు వెళ్తున్నాం. 
హాసిని: బట్టల షాపుకి కూడా ఇలాంటి బుట్టలు పట్టుకొని వెళ్లరు మీరు ఇలాంటి బుట్టలు పట్టుకొని వెళ్తే నవ్వరా.. 
వల్లభ: మమ్మీ హాసినికి మ్యాటర్‌ తెలీదు.
సుమన: బావగారు అత్తయ్య గారిని చెప్పనివ్వండి మీరు మాట్లాడి ఇబ్బంది పాలవకండి.
విక్రాంత్: ముగ్గురు ఒక మాట మీద భలే ఉంటారే..
డమ్మక్క: మాట మార్చకముందే ఆ బుట్టలో ఏముందో తెలుసుకోండి పుత్రా..
వల్లభ: ఏయ్ నీకు అవసరమా..
విశాల్: ఇలా అన్నావు అంటే ఏదో ఉండే ఉంటుంది. 
తిలోత్తమ: క్యాష్ ఉంది విశాల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి.
నయని: బ్యాగ్‌లోనో.. బ్రీఫ్‌ కేస్‌లో తీసుకెళ్లొచ్చు కదా..
 
ఇంతలో పావనా మూర్తి టిఫిన్ చేసి తన చేయి కడగమని తన భార్య ధురందరని అంటే ఆ నీరు తీసుకొని విశాల్‌ నేను కడుగుతాను అని పావనాకి సైగ చేసి వద్దు వద్దు అంటూ పావనా చుట్టూ తిరిగేలా చూస్తాడు. విశాల్ పావనాను వెంటపడినట్లు తిరిగి నీరు వల్లభ చేతిలో ఉన్న బాస్కెట్‌లో వేసేస్తాడు. అందరూ నోట్లు తడిసిపోయాయి అనుకుంటారు.

వల్లభ: మమ్మీ వేడి నీరు పడినా లేవలేదు ఏంటి. 
సుమన: బావగారు ఏం మాట్లాడుతున్నారు.
తిలోత్తమ: వీడు మూర్ఖుడు ముందు వెనక ఆలోచించడు.
పావనా: లేవలేదు అంటున్నారు బుట్టలోనుంచి పాము వస్తుందా ఏంటి..
సుమన: మనసులో.. గాయత్రీ వేడినీరు పడినా కిసుక్మనకుండా ఎలా ఉంది. 
నయని: అత్తయ్య నీరు పడ్డాయి కదా నోట్లు తడిచిపోయేలా ఉన్నాయి ఆరబెట్టి తీసుకెళ్లండి.
తిలోత్తమ: పర్వాలేదు లే నయని. ఇంతలో హాసిని గాయత్రీ పాపని ఎత్తుకొని వస్తుంది. అది చూసి తిలోత్తమ, వల్లభ, సుమనలు షాక్ అయిపోతారు. 
వల్లభ: అరే గాయత్రీ అక్కడుంది ఏంటి మమ్మీ..
హాసిని: ఇంకెక్కడుండాలి రాజా బుట్టలోనా..
విశాల్: అమ్మా టైం లేదని హడావుడిగా బయల్దేరిన మీరు ఇక్కడే ఉండి. ఈలోపు టిఫిన్ చేసేవాళ్లు కదా..
డమ్మక్క: మింగుడు పడనప్పుడు ముద్ద దిగదు విశాల్ బాబు.
విక్రాంత్: ఏదైనా సమస్యా.. 
సుమన: బాస్కెట్‌లో పట్టుకెళ్లేది డబ్బా ఇంకేమైనానా ఒకసారి చూడండి బావగారు.
తిలోత్తమ: రేయ్ కారులో చూద్దాం పదరా..
వల్లభ: హేయ్ ఆగు మమ్మీ. టెన్షన్‌తో మైండ్ పనిచేయడం లేదు. ఇప్పుడే చూద్దాం. 
తిలోత్తమ: రేయ్ అది కాదురా..
వల్లభ: ఆగు మమ్మీ.. బాస్కెట్ ఓపెన్ చేస్తే అందులో రాళ్లు ఉంటాయి.. మళ్లీ ముగ్గురు షాక్ అవుతారు. 
విశాల్: అన్నయ్య ఏంటి ఈ పిచ్చి పని అమ్మ డబ్బు పెట్టమంటే రాళ్లు పెట్టావేంటి. సుమన.. బాస్కెట్‌లో గాయత్రీ పాపని పెట్టడం చూసిని హాసిని బయట సౌండ్ చేసి పాప ప్లేస్‌లో రాళ్లు పెట్టేస్తుంది. 

ఇక తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. జరిగిన విషయం ఇద్దరూ అఖండ స్వామికి చెప్తారు. మరో అవకాశం ఇవ్వమని తిలోత్తమ అఖండ స్వామిని అడుగుతుంది. దీంతో అఖండ స్వామి మీ వల్ల అవ్వదని నేరుగా తానే రంగంలోకి దిగుతాను అని అంటారు. రేపు మీ ఇంటికి వస్తాను అక్కడ పరీక్షిస్తాను అని అంటారు అఖండ. మరోవైపు సుమన దగ్గరకు హాసిని వచ్చి గాయత్రీ పాపని బుట్టలో పెట్టి అత్తయ్య వాళ్లకి ఇవ్వాలి అనుకున్నావని చివాట్లు పెడుతుంది. దీంతో సుమన అది మా అక్క కన్న బిడ్డ కాదు కదా గాయత్రీ గురించి అంత సీరియస్‌గా తీసుకోవాలా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘జగధాత్రి’ సీరియల్‌మార్చి 2nd: దివ్యాంకను అరెస్ట్ చేసిన పోలీసులు - కౌషికికి పెన్ డ్రైవ్ ఇచ్చిన ధాత్రి

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget