అన్వేషించండి

Trinayani Serial Today March 26th: 'త్రినయని' సీరియల్: అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.. పెద్దబొట్టమ్మ దెబ్బకు గాయత్రీ పాప మాయం!

Trinayani Serial Today Episode ఉలూచిని మాయం చేసి తీసుకెళ్లాలని వచ్చిన పెద్దబొట్టమ్మ ప్లాన్ బెడిసికొట్టి గాయత్రీ పాప మాయం అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.

Trinayani Today March 26th Episode  సుమన గాయత్రీ పాపని చాటుగా తీసుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పెద్దబొట్టమ్మను డమ్మక్కను చూసిన సుమన వాళ్లవైపు చూడకుండా పరుగులు తీస్తుంది. సుమన గాయత్రీ పాపను తీసుకొని బయటకు వెళ్లింది అని పెద్దబొట్టమ్మకు డమమ్మక్క చెప్తుంది. దీంతో పెద్దబొట్టమ్మ ఏయ్ సుమన ఆగుని అరుస్తుంది. మరో వైపు పావనామూర్తి వాళ్లు ఇంట్లో అందరూ హాల్‌లోకి రావడంతో సుమన ఉలూచిని తీసుకొని బయటకు వెళ్లింది అనుకొని ఆ విషయం నయని వాళ్లకు చెప్తారు. ఇంతలో విక్రాంత్ ఉలూచిని తీసుకొని రావడంతో అందరూ షాక్ అవుతారు. 

నయని: పాపను ఎత్తుకొని వెళ్లింది అన్నారు కదా..
డమ్మక్క: డమ్మో డమ్మ.. సుమన ఎత్తుకుంది నన్ను నయని. అని గాయత్రీ పాపను తీసుకొని వస్తుంది.
దురంధర: నిన్నా..
డమ్మక్క: అవును నన్ను మోసుకొని వెళ్లగలవా అని పందెం కాసాను. ఇంతలో పెద్దబొట్టమ్మ, సుమన అక్కడికి వస్తారు. సుమన అబద్ధం జరిగింది అని ఏదో జరిగింది అని సుమన ముఖంలో తేడా కనిపిస్తుంది అని పావనా, దురంధరలు అనుకుంటారు.

నయని: పెద్దమ్మ ఏంటి ఇలా వచ్చావ్..
పెద్దబొట్టమ్మ: మునగ గౌరి నోము నోచుకుంటున్నాను నయని. దారిన కనపడిన ముత్తయిదువులకు వాయినం ఇస్తూ వెళ్తుంటే సుమనే పిలిచింది.
విక్రాంత్: నువ్వు పిలిచావా ఆశ్చర్యంగా ఉంది..
సుమన: ఇందులో ఆశ్చర్యం ఏముంది వాయినం ఇస్తూ కనిపిస్తే మన ఇంట్లో కూడా ముత్తయిదువులు ఉన్నారని రమ్మన్నాను.
తిలోత్తమ: ఎప్పడూ ఇంటి చుట్టే తిరిగే పెద్దబొట్టమ్మను మనం పిలవక్కర్లేదు.
నయని: నోము నోచుకొని వచ్చింది కదా ఇలాంటప్పుడు ఇంట్లో అడుగుపెడితే మనకే మంచిది అత్తయ్య. 

పెద్దబొట్టమ్మ వాయినం ఇవ్వడానికి సిద్ధమైతే నలుగురికి ఒకేసారి వాయినం ఇవ్వమని సుమన అంటుంది. అంత భయం ఉన్నదానివి ఎందుకు పెద్దబొట్టమ్మను ఇంటికి పిలిచావు అని అడిగితే డమ్మక్క కలుగజేసుకొని ఒప్పదం అలాంటిది పుత్రా అని చెప్తుంది. సుమన, పెద్దబొట్టమ్మ షాక్ అవుతారు. 

విశాల్: దేని పైన ఒప్పందం చేసుకున్నారు డమ్మక్క.
డమ్మక్క: ఒకర్ని ఒకరు దూషించుకోకుండా వచ్చిన పని చేసుకొని వెళ్లాలనే ఒప్పందం చేసుకున్నారు. 

ఫ్లాష్‌బ్యాక్

పెద్దబొట్టమ్మ సుమనను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగి కొంగు తీసి గాయత్రీ పాపను చూస్తుంది. మన బిడ్డను కాకుండా నయని బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. తాను గాయత్రీని ఎత్తుకొని వెళ్తే తాను ఉలూచిని ఎత్తుకొని పోతానని పెద్దబొట్టమ్మ సుమనను బెదిరిస్తుంది. దీంతో సుమన కిడ్నాప్ డ్రామాను పక్కన పెడుతుంది.

ప్రస్తుతం

పెద్దబొట్టమ్మ అందరికీ వాయినం ఇస్తుంది. తర్వాత పెద్దబొట్టమ్మ ఉలూచి, గాయత్రీ పాపలను కూర్చొపెట్టి ఖాళీ అయిప గంపతో దిష్టి తీస్తాను అంటుంది. సుమన కంగారు పడుతుంది.

పెద్దబొట్టమ్మ: ఈ బుట్టను కప్పి ఉలూచిని మాయం చేసి నేను కూడా పాముగా మారి వెళ్లిపోతే సుమన ఏం చేస్తుంది. 
సుమన: ఇది ఏదో చేయబోతుంది. ఉలూచిని ఎలా అయినా కపాడుకోవాలి. త్వరగా దిష్టి తీయు పెద్దమ్మ. 
 
పెద్దబొట్టమ్మ దిష్టి తీసి ఉలూచిని మాయం చేయాలి అనుకుంటే గాయత్రీ పాప మాయం అయిపోతుంది. అందరూ షాకై పోతారు. పాప ఏది అని తెగ కంగారు పడతారు. పెద్దబొట్టమ్మను అందరూ అడుగుతారు. తాను గాయత్రీని మాయం చేయలేదు అని చెప్తుంది. అందరూ గాయత్రీ పాపను వెతికే పనిలో పడతారు. ఇక గాయత్రీ పాప కనిపించడం లేదు అని తను కనిపించకపోవడంతో హ్యాపీగా ఫీలవుతారు తిలోత్తమ, వల్లభ. 

తిలోత్తమ: కోట్లకు అధినేత్రి అయినందుకు దిష్టి తగిలి ఇలా అయిందో లేదంటే గుడ్డిగా విష సర్పాన్ని నమ్మి పెద్దబొట్టమ్మను ఇంట్లోకి రానిచ్చినందుకు ఇలా అయిందో అదంతా మనకు అనవసరం. కానీ విశాల్, నయనిల ముందు అయ్యో పాపం అన్నట్లే మనం ఉండాలి. గాయత్రీ ఇక కనిపించకుండా పోతే ఆస్తి పత్రాలను క్యాష్‌ చేసుకోవాలి. పాప దొరికితే మాయం చేయడానికి కారణం అయిన వాళ్లను ఇరికించేసి మంట పెట్టి మనం కూల్‌గా ఉండాలి. 

విశాల్, నయని, హాసినీలు పాప కనిపించడం లేదని కంగారు పడతారు. విశాల్‌ హాసినితో పాప తన తల్లి కాబట్టి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుందనే ధైర్యంతో ఉన్నానని అంటాడు.  ఇక నయని తెగ కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: గాయత్రీ సింహాద్రి: ‘కార్తీక దీపం 2'లో లేడీ విలన్ ఈమే - భయంగా ఉందన్న నిరూపమ్, ధైర్యం చెప్పిన ప్రేమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget