Trinayani Serial Today June 6th: 'త్రినయని' సీరియల్ : ఒక్క స్పర్శతో తల్లిని గుర్తుపట్టిన విశాల్.. ఉలూచిని సుమనకు అప్పగించిన మోడ్రన్ తిలోత్తమ..!
Trinayani Serial Today Episode : కొత్తగా వచ్చిన తిలోత్తమ తన వెంట ఉలూచిని తీసుకొచ్చి ఉలూచినే తనని సర్పదీవి నుంచి బయటకు తీసుకొచ్చిందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.
Trinayani Today Episode : కొత్త తిలోత్తమ విశాల్‌ని తాకగానే విశాల్ అమ్మ అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇక విక్రాంత్ ఏంటి బ్రో నువ్వు అనేది అని అంటే విశాల్ అవునురా నిన్ను కన్న తల్లి నన్ను పెంచిన తల్లి తిలోత్తమ అమ్మే అని అంటాడు. ఇక తిలోత్తమ తాను కన్నకొడుకుల కంటే తాను పెంచిన కొడుకే తనని గుర్తు పట్టాడు అని ప్రేమతో నిన్ను టచ్ చేశా నాన్న అనుకున్నట్లే గుర్తు పట్టావ్ థ్యాంక్స్ నాన్న అని ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక వల్లభ మా అమ్మేనా అని అడుగుతాడు.
సుమన: ఆవిడ అత్తయ్య అయితే మరి నా ఉలూచి.
దురంధర: నువ్వు ఉండవే.
పావనా: రూపం మారుతుంది అన్నారు కానీ మరీ ఇంతలానా.
నయని: మమల్ని ఎవర్నీ పలకరించకుండా కేవలం మీతో మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయింది ఏంటి బాబుగారు.
హాసిని: ఆ గ్లామరస్ లేడీ అత్తయ్య అనుకుంటున్నారా నేను నమ్మము.
విశాల్: వదినా వచ్చింది అమ్మే. నన్ను ఎత్తుకొని పెంచింది కదా నేను గుర్తు పట్టగలిగాను.
వల్లభ: రిచ్ కారులు డ్రైవర్.. అసిస్టెంట్‌లు నాకేం అర్థం కావడం లేదు.
లోపలికి అందరూ వెళ్తారు. రూపం మారిన తిలోత్తమ లోపల దర్జాగా కూర్చొని ఉందని అనుకుంటారు. అందరూ ప్రశ్నించాలి అనుకుంటారు. అందరినీ ఎప్పటిలానే పిలిచి మాట్లాడుతుంది. సర్పదీవికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు రూపం మారిపోయి ఉంటుందని మీతో గురువుగారు చెప్పారన్నమాట అని అంటుంది. వంద శాతం మారిపోవడం ఆశ్చర్యంగా ఉందని వల్లభ అంటే తప్పు లేదు అని అంటుంది.
సుమన: విశాల్ బావగారు తర్వాత మిమల్ని నేనే నమ్ముతున్నాను అత్తయ్య. నా కూతురు ఉలూచి కూడా వస్తుంది అన్నారు కదా ఏది.
తిలోత్తమ: హా వచ్చింది. అని పీఏకి కాల్ చేసి ఉలూచిని లోపలికి తీసుకురమ్మని చెప్తుంది.
వల్లభ: మమ్మీ సర్పదీవికి వెళ్లేటప్పుడు నీ ఫోన్ ఇంట్లో వదిలి వెళ్లావు కదా.
తిలోత్తమ: తిరిగి వచ్చేటప్పుడు నా రూపమే కాదు నాన్న నా లైఫ్ స్టైలే మారిపోయింది. అలా ఎలా అని మీరు అడిగితే చెప్పడానికి ఒక రోజు సరిపోదు.
విక్రాంత్: తీరికగా చెప్పొచ్చులేమ్మా ముందు ఉలూచి వస్తే కానీ అన్నీ నమ్మలేం.
అసిస్టెంట్లు పూల బుట్టలో ఉలూచిని తీసుకొస్తారు. సుమన ఎత్తుకొని రూపం మారిపోలేదు అని ఎత్తుకొని ముద్దాడుతుంది. గాయత్రీ పాప సర్పదీవిలో మిస్ అయిన తర్వాత తనకు ఏం అర్థం కాలేదు అని ఉలూచి కూడా తప్పిపోయింది అనుకున్నానని కానీ తప్పిపోయిన తనని ఉలూచి బయట పడేయగలిగిందని తిలోత్తమ చెప్తుంది. ఇక సుమన తిలోత్తమకు చాలా థ్యాంక్స్ చెప్తుంది.
నయని, విశాల్, హాసినిలు తిలోత్తమ రూపం మారడం గురించి మాట్లాడుకుంటారు. విశాల్ డ్రైవర్‌తో మాట్లాడాను అని అన్ని తిలోత్తమ అమ్మ సొంతమే అని చెప్పాడని అంటాడు. ఇక హాసిని, నయనితో మనం కూడా వెళ్దాం అని అంటుంది. నయని కూడా సరే అంటే విశాల్ ఇద్దరిని తిడతాడు. అయితే నయని తాను సరదాగా అన్నాను అని అంటుంది. తిలోత్తమ అద్దంలో తన అందం చూసుకొని మురిసి పోతుంది. వల్లభ చాటుగా కాస్త తడబడుతూ తల్లి దగ్గరకు వస్తాడు. విశాల్ మనల్ని ఎప్పుడూ శత్రువులా చూడలేదు కానీ నయని మనకు తల నొప్పిగా మారిందని కొడుకుతో అంటుంది. అన్నీ బాగా గుర్తున్నాయ్ అని వల్లభ అంటే నా రూపం మారింది కానీ నా మెమరీ పోలేదు అని అంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.