అన్వేషించండి

Trinayani Serial Today July 9th: 'త్రినయని' సీరియల్: చింతామణి రాయితో అబద్దం చెప్పిన విశాల్.. తల పగలగొట్టుకుంటాడా!

Trinayani Serial Today Episode విశాల్ చింతామణి రాయి పట్టుకొని అబద్ధం చెప్పడం విశాల్ తలను రాయికి కొట్టుకునే టైంకి విశాలాక్షి ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode విశాలాక్షి చింతామణికి అభిషేకం చేస్తుంటే.. డమ్మక్క విశాలాక్షిపై పూలు వేస్తుంటుంది. సుమన పూజలు ఆపమని వాళ్లతో చెప్తుంది. అందరూ సుమనను ఎందుకు ఆపావని అడుగుతుంది. దీంతో సుమన ఓ పరీక్ష చేయాలని అది అయ్యాకే పూజలు చేసుకోమని అంటుంది.

సుమన: మా అక్క మొగుడు అంటే మా విశాల్ బావ ఏం చెప్పుకుండానే మా అక్కని బాధ పెడుతున్నారు. 
విశాల్: నేను నయనిని బాధ పెడుతున్నానా.
పావనా: ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా వాళ్ల మధ్య సఖ్యత లేదా. 
 సుమన: దాంపత్య జీవితం గురించి నేను చెప్పడం లేదు బాబాయ్. మా అక్క కన్న కూతురు గురించి నేను వాదిస్తున్నాను. నువ్వు కన్నతొలి బిడ్డ గురించి ఏం చెప్పడం లేదు అంటున్నా అక్క. తనెక్కడుందో ఎలా ఉందో విశాల్ బావ గారు చెప్పాలి.
విక్రాంత్: ఏయ్ మెంటల్ కేసు. బ్రోకి తెలిస్తే చెప్తాడని ఇంతకు ముందే చెప్పానా.
విశాల్: ఏం మాట్లాడుతున్నావ్ సుమన నాకు తెలిస్తే నేను చెప్పనా.
విశాలాక్షి: పాపం సుమన ఆరాటంలో అర్థం ఉంది.
విశాల్: ఎప్పుడూ ఇలాగే అడిగి మమల్ని ఇబ్బంది పెట్టడం తనకి అలవాటే అమ్మ.
సుమన: నువ్వు కన్న తొలి బిడ్డ గురించి విశాల్ బావగారికి తెలిసినా ఎప్పటి నుంచో అబద్దం ఆడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. 
తిలోత్తమ: విశాల్‌ తన కన్న కూతురు అలియాస్ గాయత్రీ అక్కయ్య పునర్జన్మ జాడ తెలిసినా చెప్పడం లేదు అంతే కదా. నేను సర్పదీవి నుంచి ఏవో చిల్లర సామాను ఎత్తుకొస్తేనే దొంగ అని ముద్ర వేశారు. మరి ఇప్పుడు అదే రాయిని విశాల్ పట్టుకుంటే. 

అందరూ విశాల్‌ని చింతామణి రాయిని పట్టుకోమంటారు. హాసిని, పావనా అడ్డుకున్నా అందరూ ఒప్పుకోరు. విశాల్ తప్పని పరిస్థితిలో రాయిని పట్టుకుంటాడు. తనకు గాయత్రీ దేవి పునర్జన్మ గురించి ఏం తెలీదు అని అంటాడు. చింతామణి రాయి తిరుగుతుంది. విశాల్ తల తిరిగి రాయిని కొట్టుకునే టైంలో విశాలాక్షి విశాల్ తల మీద చేయి వేస్తుంది. దీంతో రాయి సుమనకు తగులు తుంది. నొప్పితో విలవిల్లాడిపోతుంది. విశాల్ని అలా అడిగినందుకు విశాల్ బాధ పడి ఉంటాడని విక్రాంత్ సుమనను తిడుతుంది. ఇద్దరూ గదిలో గొడవ పడతారు. సుమనతో ఎంత తొందరగా విడిపోతే అంత హ్యాపీ అని విక్రాంత్ అంటాడు. తమ గది కేవలం గొడవలకు మాత్రమే ఉపయోగిస్తున్నాను అని ఇంకా దేనికి ఉపయోగించడం లేదని సుమనతో అంటాడు.  ఉదయం గాయత్రీని తీసుకొని విశాల్ దగ్గరకు వస్తుంది. విశాల్ తను బిజీలో ఉన్నానని పాపని నయనికి ఇమ్మని చెప్తాడు. చింతామణి రాయి పట్టుకొని అబద్ధం చెప్పినా నీకు ఏం కాలేదు ఎందుకని హాసిని అడుగుతుంది. దానికి విశాల్  విశాలాక్షి ఆపకుంటే అదే జరిగేదని అంటాడు. అయితే నీ ప్రాణం పోయేదన్నమాట అని హాసిని అంటే ఏంటి ఆ మాటలు అంటూ నయని అక్కడికి వస్తుంది. సుమన సారీ చెప్తుంది. గాయత్రీ వల్లే అలా జరిగిందని హాసిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని కలిసిన జాను, వివేక్.. మిత్ర కోసం ఇంటికి వెళ్లిన లక్ష్మీని అందరూ చూసేస్తారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget