అన్వేషించండి

Trinayani Serial Today July 31st: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ మెడలో తాయెత్తు వేసి ముప్పుతిప్పులు పెట్టిన గాయత్రీ.. ఉలూచికి ఆత్మ ఆవహించిందా!

Trinayani Serial Today Episode గాయత్రీదేవి ఫొటో ముందు తిలోత్తమ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వెటకారంగా మాట్లాడటం గాయత్రీ పాప తిలోత్తమకు చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode నలుగురి పిల్లల మెడలో తిలోత్తమ తాయెత్తులు కడుతుంది. ఎవరి శరీరంలోకి గాయత్రీ దేవి ఆత్మ వస్తుందా అని పావనా, హాసిని, నయని, విశాల్‌లు మాట్లాడుకుంటారు. ఇక హాసిని పిల్లలందరికీ తాయెత్తులు వద్దని కేవలం గాయత్రీ పాపకే కడితే సరిపోతుందని గాయత్రీ దేవి ఆత్మ ఈ పాప దగ్గరకే వస్తుందని అంటుంది. 

హాసిని: తను గాయత్రీ  అని పేరు పెట్టుకుంది కాబట్టి గాయత్రీ అత్తయ్య ఈ పాపనే ఆవహిస్తుంది.
నయని: అయితే గాయత్రీ పాపే గాయత్రీ అమ్మగారి ఆచూకి చూపించాలని నువ్వు అంటావ్. అయితే మిగతా అందరి పిల్లల తాయెత్తులు తీసేసి గాయత్రీ పాపకే ఉంచుదామక్క.
విశాల్: నయని నువ్వు తొందర పడకు వెళ్లి మెరూన్ కలర్ ఫైల్ తీసుకురా.
పావనా: ఏంటమ్మా నువ్వు అలా చెప్తావ్.
విశాల్: వదినా నువ్వు పెట్టే టెన్షన్‌కి మాకు ప్రాణాలు పోతున్నాయి.
హాసిని: రిలాక్స్. గాయత్రీ అత్తయ్య గాయత్రీ పాపని ఆశ్రయిస్తే పునర్జన్మలో ఉన్న గాయత్రీ పాప ఆచూకి చూపించడం కష్టం కదా అదే ఉలూచి గానవి వీళ్లలో ఎవర్ని అయినా ఆశ్రయిస్తే గాయత్రీ పాపని చూపిస్తే దొరికిపోతాం. 
విశాల్: లాజికే మామయ్య.

తిలోత్తమ హాల్లో కూర్చొని బిజినెస్ కాల్ మాట్లాడుతుంటుంది. తర్వాత గాయత్రీ దేవి ఫొటో చూస్తూ నువ్వు బతికున్నప్పుడు నీ వైపు కూడా చూసి మాట్లాడలేకపోయిన నేను నువ్వు చనిపోయాక నీ ఫొటో ముందు కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చొని ఉన్నానని ఫీలవుతున్నావా తప్పదు అక్క ఏం చేయలేం అని అనుకుంటుంది. ఇంతలో గాయత్రీ పాప పెద్ద తాడు పట్టుకొని మేడ మీద నిల్చొంటుంది. పాప తన మెడలో ఉన్న తాయెత్తుని తీసేసి కింద ఉన్న తిలోత్తమ మెడలో వేసేస్తుంది. అది చూసిన తిలోత్తమ తన మెడలో తాయెత్తు పడటం ఏంటి కొంప తీసి గాయత్రీ దేవి అక్క ఆత్మ తనలోకి వచ్చేస్తుందా ఏంటని కంగారు పడుతుంది. ఇక గాయత్రీ పాప పై నుంచి తాడు వేయడంతో అది తిలోత్తమ కదలకుండా కట్టేస్తుంది. తిలోత్తమ ఉక్కిరి బిక్కిరి అయి ఎవరు అని అరుస్తుంది. గాయత్రీ పాప కనిపించకుండా మేడ మీద నుంచి తాడు అటూ ఇటూ ఊపుతుంటే తిలోత్తమ  తెగ ఇబ్బంది పడుతుంది. విక్రాంత్, వల్లభ అని అరుస్తుంది. ఇంట్లో అందరూ వచ్చి తాడు విప్పుతారు. తర్వాత తిలోత్తమ గాయత్రీ దేవి ఫొటో కోపంగా చూస్తూ తన వల్లే ఇలా జరిగిందని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. 

ఇక విశాల్ అమ్మ నీ మెడలో తాయెత్తు ఉంది అంటే అమ్మ నీకు అవహించాలని అనుకున్నావా అని అడుగుతాడు. దానికి నయని అది జరగదు అని అంటుంది. ఒక వేళ అలా జరిగితే అది తిలోత్తమ అత్తయ్య మరణమే అని అంటుంది. దాంతో అందరూ భయపడతారు. హాసిని మాత్రం అలాగే జరగాలి కదా అని అంటుంది. పైన గాయత్రీ పాప ఉందని అనిపించిందని తిలోత్తమ అంటుంది. కవర్ చేయడానికి విశాల్ చిన్న పిల్ల మీద నీకు అనుమానం ఏంటని అంటాడు. ఇక ఇంత పెద్ద తాడు పిల్ల ఎలా వేయగలదని నయని ప్రశ్నిస్తే గాయత్రీ అక్క మాత్రమే వేయగలదని అంటుంది. ఏ పసిబిడ్డ మెడలో తాయెత్తు లేకపోతే ఆమెకు గాయత్రీ దేవి ఆత్మ వచ్చినట్లే అని తిలోత్తమ అంటుంది. ఇక అందరూ కన్ఫ్మమ్ చేయడానికి గాయత్రీ పాపని పిలుస్తారు. ఇంతలో గాయత్రీ పాప మెడలో తాయెత్తుతో వస్తుంది. విశాల్ సంతోషపడతాడు. 

ఫ్లాష్ బ్యాక్‌లో పడుకొని ఉన్న ఉలూచి మెడలోని తాయెత్తును పాము తీసుకొని వెళ్లి గాయత్రీ పాప మెడలో వేస్తుంది. ఇక గాయత్రీ పాప మెడలో తాయెత్తు ఉంది అంటే ఎవరి మెడలో లేదో చూడటానికి తిలోత్తమ, వల్లభ వెళ్తారు. ఇక సుమన గదిలోకి వెళ్తుంది. చూస్తే ఉలూచి మెడలో తాయెత్తు లేకపోవడం చూసి షాక్ అవుతుంది. తిలోత్తమకి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది కవర్ చేయాలని చూస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ప్రేమతో కన్నీళ్లు పెట్టించేసిన సత్య, క్రిష్‌లు.. ముసుగులో వచ్చి ధనుంజయ్‌కి అండగా నిలిచిన క్రిష్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget